Begin typing your search above and press return to search.

వీడియో : బన్నీని గట్టిగా నవ్వించిన పిల్లలు

By:  Tupaki Desk   |   24 Oct 2020 9:50 AM GMT
వీడియో : బన్నీని గట్టిగా నవ్వించిన పిల్లలు
X
మహేష్‌ బాబు కూతురు సితార ఫొటోలు మరియు వీడియోలు సోషల్‌ మీడియాలో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఇతర స్టార్స్‌ కిడ్స్‌ కూడా సోషల్‌ మీడియాలో ఏదో ఒక సందర్బంలో సందడి చేస్తూ ఉంటారు. సితార మాదిరిగానే అల్లు అర్జున్‌, స్నేహ రెడ్డిల పిల్లలు కూడా సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అల్లు అర్జున్‌ లేదా స్నేహా రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరు రెగ్యులర్‌ గా పిల్లల వీడియోలను ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్‌ పిల్లల వీడియోను షేర్‌ చేశాడు. అందులో తాను చాలా గట్టిగా నవ్వుతూ పిల్లల డాన్స్‌ ను ఎంజాయ్‌ చేశాడు.

టీవీలో చూసుకుంటూ అయాన్‌ ఫన్నీ డాన్స్‌ వేస్తూ ఉండగా అర్హా కూడా అతడితో జాయిన్‌ అయ్యింది. వారు వేసే ఫన్నీ స్టెప్పులకు బన్నీ గట్టి గట్టిగా నవ్వడం వీడియోలో వినవచ్చు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. గత ఆరు ఏడు నెలలుగా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా బన్నీ షూటింగ్స్‌ లేకపోవడంతో ఎక్కువ శాతం పిల్లలతో ఆడుతున్నాడు. చాలా సార్లు బన్నీ తన పిల్లల వీడియోలను షేర్‌ చేశాడు. ఈసారి మళ్లీ పిల్లల డాన్స్‌ షేర్‌ చేశాడు. త్వరలో బన్నీ పుష్ప సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు.