Begin typing your search above and press return to search.

'బి ఇండియా-బయ్ ఇండియా' ఆలోచన గొప్పది: అల్లు అర్జున్ ట్వీట్

By:  Tupaki Desk   |   15 Aug 2020 4:30 PM GMT
బి ఇండియా-బయ్ ఇండియా ఆలోచన గొప్పది: అల్లు అర్జున్ ట్వీట్
X
ఈ 2020 ప్రారంభంలో 'అల వైకుంఠ‌పురంలో' సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పుష్క చిత్రంలో నటించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక బ‌న్నీ బర్త్‌డే సంద‌ర్భంగా విడుదల చేసిన పుష్ప టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఊరమాస్‌ లుక్కులో క‌నిపించి ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చాడు. బన్నీ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. అందుకు తగ్గట్లే ఐదు భాషల్లో ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుద‌ల చేశారు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బ‌న్నీ లారీడ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ కానున్నాడు బన్నీ. ఇదిలా ఉండగా.. ఈ మధ్య ఇండియాలో విదేశీ ఉత్పత్తుల వాడకం తగ్గించి దేశి ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని సెలబ్రిటీల క్యాంపెయిన్ రోజురోజుకి డెవలప్ అవుతోంది. ఇటీవలే అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్.. విదేశీ వస్తువుల వాడకం ఆపేస్తానని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ 'బి ఇండియా - బయ్ ఇండియా' అనే క్యాంపెయిన్ను అల్లు అర్జున్ కూడా ప్రోత్సహిస్తున్నాడు. తను కూడా భారతీయ ఉత్పత్తులను మాత్రమే వాడాలనే ఈ సంకల్పం చాలా గొప్పదని బన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక అల్లు అర్జున్ ఈ ప్రోగ్రాంను ప్రోత్సహించడంతో నెటిజన్లు తెగ కంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప సినిమా షూటింగులో పాల్గొనబోతున్నాడు. అంతేగాక డైరెక్టర్ కొరటాల శివతో కూడా ఓ సినిమా కోసం సంతకం చేసినట్లు తెలుస్తుంది.