Begin typing your search above and press return to search.

`త‌గ్గేదేలే..!` డైలాగ్ వెన‌క‌ అంత క‌థ ఉందా?

By:  Tupaki Desk   |   11 March 2021 9:15 AM GMT
`త‌గ్గేదేలే..!` డైలాగ్ వెన‌క‌ అంత క‌థ ఉందా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా లో బ‌న్ని మాస్ ధ‌మాకా ట్రీట్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ల‌కు స‌హ‌క‌రించే లారీ డ్రైవ‌ర్ గా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో బ‌న్ని న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం ఉంది.

ఇంత‌కుముందు అత‌డి మాస్ లుక్ ని లాంచ్ చేయ‌గా.. ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇక ఈ మూవీలో బ‌న్ని ప‌దే ప‌దే చెప్పే డైలాగ్ ఒక‌టి తాజాగా లీకైంది. `త‌గ్గేదేలే..` అంటూ మొన్న `చావు క‌బ‌రు చ‌ల్లాగా` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్ప అప్ డేట్ ని అల్లు అర్జున్ చెప్ప‌క‌నే చెప్పేశారు. పుష్ప‌లో అత‌డు పదే ప‌దే చెప్పే డైలాగ్ ఇదే అని స‌మాచారం. ఇదే డైలాగ్ ని అన్ని భాష‌ల్లోనూ వినిపిస్తుంద‌ట‌.

పుష్ప హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ లో కూడా `త‌గ్గేదేలే...` అంటూ డైలాగ్ చెబుతాడు బ‌న్ని. ఆ ఒక్క డైలాగ్ లీక్ చేసి బ‌న్ని మూవీపై హైప్ పెంచేశాడు. సుక్కూ గ‌త సినిమాల‌కు డైలాగ్స్ ప్ర‌ధాన బ‌లం. ఇప్పుడు కూడా పుష్ప‌లో ఆ మ్యాజిక్ క‌నిపిస్తుంద‌నే భావిస్తున్నారు. బ‌న్ని మాస్ లుక్ కి త‌గ్గ‌ట్టే డైలాగ్స్ కూడా రేంజు పెంచుతాయ‌నే అర్థ‌మ‌వుతోంది. 2021లో క్రేజీ పాన్ ఇండియా సినిమాల కేట‌గిరీలో పుష్ప పేరు కూడా మార్మోగుతోంది. ఆగ‌స్టు 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది.