Begin typing your search above and press return to search.

థియేట‌ర్ కి వెళ్లిన బ‌న్నీ.. ఫ్యాన్స్ హ‌ల్ చ‌ల్‌

By:  Tupaki Desk   |   17 Dec 2021 9:30 AM GMT
థియేట‌ర్ కి వెళ్లిన బ‌న్నీ.. ఫ్యాన్స్ హ‌ల్ చ‌ల్‌
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన భారీ క్రేజీ చిత్రం `పుష్ప : ది రైజ్‌`. రెండు భాగాలుగా సిద్ధ‌మైన ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ళ‌యాల వెర్ష‌న్ మిన‌హాయించి మిగ‌తా నాలుగు భాష‌ల్లో విడుద‌లైంది.

గురువారం అర్థ్రా రాత్రి నుంచే హంగామా మొద‌లు కావ‌డంతో బ‌న్నీ అభిమానులు భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల ముందు హ‌ల్ చ‌ల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. శుక్ర‌వారం ఈ మూవీ టాక ఉద‌యానికే బ‌య‌టికి వ‌చ్చేయ‌డంతో అభిమానుల్లో ఆనందం క‌ట్ట‌లు తెంచుకుంది.

ప్రీమియ‌ర్ షో నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకున్నీ మూవీ ఇప్పుడ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎక్క‌డ చూసినా `పుష్ప‌` పైనే చ‌ర్చ జ‌రుగుతోంది.

సినిమా ఏరేంజ్ హిట్ అని అప్పుడే బెట్టింగ్ లు కూడా మొద‌ల‌య్యాయి. అంతే కాకుండా మొద‌టి షో టాక్ బయ‌టికి రావ‌డం.. బ‌న్నీ మేన‌రిజ‌మ్స్‌.. లుక్ ప‌రంగా ఓ రేంజ్ లో పుష్ప‌రాజ్ పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించాడ‌ని స్ప‌ష్టం కావ‌డంతో బ‌న్నీ అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద హ‌ల్ చ‌ల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

ఈ నేప‌థ్యంలో ఫ్యామిలీతో క‌లిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వున్న మెయిన్ థియేట‌ర్ సంధ్య‌లో సిన‌మా చూడటానికి థియేట‌ర్ కు చేరుకున్నారు హీరో అల్లు అర్జున్. ఈ విష‌యం ముందు బ‌య‌టికి పొక్క‌డంతో బ‌న్నీని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకుని చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. కార్ ఓపెన్ విండో ద్వారా బ‌య‌టికి వ‌చ్చిన బ‌న్నీ ప్రేక్ష‌కులు త‌న‌ని చూస్తూ చేస్తున్న హంగామాని గ‌మ‌నించి వారికి అభివాదం చేశారు.

దీంతో ఒక్క‌సారిగా రెచ్చిపోయిన అభిమానులు కేక‌లు.. అరుపుల‌తో ర‌చ్చ ర‌చ్చ చేశారు. హీరో అల్లు అర్జున్ ని చుట్టుముట్టి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఉద‌యం నుంచి సినిమా కు పాజిటీవ్ టాక్ వినిపిస్తుండ‌టం.. ప్ర‌తీ థీయేట‌ర్ వ‌ద్ద అభిమానులు హంగామా చేస్తుండ‌టంతో బ‌న్నీ ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి.

ఇదిలా వుంటే బ‌న్నీని చుట్టుముట్టేసిన‌ అభిమానుల్ని క‌ట్ట‌డి చేయ‌డం కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. పోలీసుల భారీ భ‌ద్ర‌త మ‌ధ్య బ‌న్నీ త‌న ఫ్యామిలీలో క‌లిసి సంధ్యా థియేట‌ర్‌లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్ గా మారంది.