Begin typing your search above and press return to search.

మూడు రోజుల్లో 30 కోట్లు కొల్ల‌గొట్టేశాడు

By:  Tupaki Desk   |   25 April 2016 5:30 PM GMT
మూడు రోజుల్లో 30 కోట్లు కొల్ల‌గొట్టేశాడు
X
టాక్ ఎలా ఉన్నా స‌రే.. స‌రైనోడు అస్స‌లు త‌గ్గ‌లేదు. మూడే రోజుల్లో 30.3 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసి ఔరా అనిపించాడు. గ్రాస్ వ‌సూళ్లు రూ.46 కోట్ల దాకా ఉండ‌టం విశేషం. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా స‌రైనోడు రికార్డు సృష్టించింది. బ‌న్నీ బాక్సాఫీస్ స్టామినాకు ఈ సినిమా మ‌రో నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్.. తెలంగాణ క‌లిపే స‌రైనోడు రూ.21.8 కోట్ల షేర్‌.. రూ.31.45 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఏరియా అయిన నైజాంలో మూడు రోజుల‌కే రూ.7.07 కోట్ల షేర్ వ‌చ్చింది. గ్రాస్ రూ.10 కోట్ల మార్కును దాటిపోయింది.

రాయ‌ల‌సీమ (సీడెడ్‌)లో రూ.4.35 కోట్ల షేర్‌.. రూ.5.35 కోట్ల గ్రాస్ వ‌సూలైంది. ఉత్తరాంధ్ర‌లో రూ.2.4 కోట్ల షేర్ రావ‌డం విశేషం. మొత్తంగా ఆంధ్రా ఏరియాలో రూ.10 కోట్ల దాకా షేర్.. రూ.15 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది స‌రైనోడు. ఓవ‌ర్సీస్ లో మాత్రం క‌లెక్ష‌న్లు ఓ మోస్త‌రుగా ఉన్నాయి. యుఎస్ లో రూ.2.3 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ రూ.70 ల‌క్ష‌లు షేర్ వ‌చ్చింది. క‌ర్ణాట‌క‌లో స‌రైనోడు సాధించిన వ‌సూళ్లు చూస్తే క‌ళ్లు తిర‌గ‌డం ఖాయం. ఒక్క బెంగ‌ళూరులోనే ఈ సినిమా మూడు రోజుల్లో రూ.1.5 కోట్లు.. మిగ‌తా ప్రాంతాల్లో రూ.3.25 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డం విశేషం. ఇంకో పాతిక కోట్లు వ‌సూలు చేస్తే స‌రైనోడు హిట్ కేల‌గిరిలోకి వేసేయొచ్చు. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ ను రూ.54 కోట్ల‌కు అమ్మాడు నిర్మాత అల్లు అర‌వింద్‌.