Begin typing your search above and press return to search.

బన్నీ సెంటిమెంటుకే ఓటేశాడు

By:  Tupaki Desk   |   4 Nov 2015 5:30 PM GMT
బన్నీ సెంటిమెంటుకే ఓటేశాడు
X
అల్లు అర్జున్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్ లో ‘సరైనోడు’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రి ప్రొడక్షన్ విషయంలో బాగా ఆలస్యమైన ఈ సినిమా.. షూటింగ్ విషయంలో మాత్రం యమ స్పీడు మీదుంది. రెండు నెలల నుంచి నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నారు. ఔట్ పుట్ కూడా బాగానే వస్తున్నట్లు చెబుతున్నాయి గీతా ఆర్ట్స్ వర్గాలు. ఈ సినిమాను ముందు ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ మారిందట. తనకు అచ్చొచ్చిన సమ్మర్ సీజన్ లోనే సినిమాను విడుదల చేద్దామని ఫిక్సయ్యాడట బన్నీ.

బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన ఆర్య - రేసుగుర్రం - సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సమ్మర్లోనే విడుదలయ్యాయి. ముఖ్యంగా గత రెండు సమ్మర్లలోనూ బన్నీకి బిగ్ హిట్స్ ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాది వేసవికి ‘సరైనోడు’ సినిమాను రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు అల్లు హీరో. లెజెండ్ తర్వాత బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా కావడంతో ‘సరైనోడు’ మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇందులో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో రకుల్ ది ఎమ్మెల్యే పాత్ర కావడం విశేషం. ప్రేమ పేరుతో ఎమ్మెల్యే వెంట పడి.. చిక్కులు తెచ్చుకునే కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు బన్నీ.