Begin typing your search above and press return to search.

కొత్త రాష్ట్రంలో బన్నీ - బోయపాటి

By:  Tupaki Desk   |   15 Nov 2015 4:09 AM GMT
కొత్త రాష్ట్రంలో బన్నీ - బోయపాటి
X
సన్నాఫ్ సత్యమూర్తి వంటి క్లాస్ సినిమా తరువాత మాస్ అంశాలను మేళవించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'సరైనోడు' సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. అల్లు అర్జున్ బన్నీ తరువాత పూర్తిస్థాయి యాక్షన్ రోల్ లో కనిపించింది లేదు. ఈ సినిమాతో మరోసారి ఆ ప్రయత్నం చేయనుండడం విశేషం.

పెద్ద నటులతో, పెద్ద డైరెక్టర్ ల సినిమాలంటే అయితే హైదరాబాద్ లేకపోతే ఫారెన్ లో చుట్టేస్తున్నారు తప్ప వేరే ప్రాంతాలకు మక్కువ చూపడంలేదు. అయితే బన్నీ ప్రస్తుతం తన చిత్ర షూటింగ్ లో కొంత భాగాన్ని రాజమండ్రిలో షూట్ చేయనున్నట్టు సమాచారం. కేవలం అక్కడి వాతావారణాన్ని తెరపై చూపించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో బన్నీతో పాటూ రకుల్ ప్రీత్ సింగ్ - కేథరీన్ త్రెస హీరోయిన్లుగా నటిస్తున్నారు. బన్నీ తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాను తెరకేక్కిస్తున్నాడు. థమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ విడుదలకు ముస్తాబవుతుంది.