Begin typing your search above and press return to search.

బాడీగార్డ్, పోలీస్.. క్లారిటీ మిస్

By:  Tupaki Desk   |   23 April 2016 3:30 PM GMT
బాడీగార్డ్, పోలీస్.. క్లారిటీ మిస్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు మూవీకి రిలీజ్ రోజు నుంచి మిక్సెడ్ టాక్ వచ్చింది. ఇందుకు కారణాలను చాలారకాలుగా విశ్లేషణలు మొదలయిపోయాయి. అందులో మొదటగా బన్నీ కేరక్టరైజేషన్ అంటున్నారు. అసలు ఈ సినిమాలో బన్నీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడనే ప్రచారం మొదటి నుంచి జరిగింది.

బన్నీ చేస్తున్నది ఓ పోలీస్ పాత్ర అని.. తర్వాత యంగ్ లేడీ ఎమ్మెల్యేకు బాడీగార్డ్ అవతారం ఎత్తుతాడని అన్నారు. ఇవే ఎక్స్ పెక్టేషన్స్ తో సరైనోడు మూవీకి వెళ్లినోళ్లకి తగిలిన ఫస్ట్ షాక్ ఇదే. సినిమాలో బన్నీది బాడీగార్డ్ రోల్ కాదు.. పోలీస్ పాత్ర కూడా కాదు. ఆర్మీలో ఉండలేక వచ్చేసిన ఓ చీఫ్ సెక్రటరీ కొడుకు రోల్ అంతే. బన్నీని పోలీస్ గా చూద్దామనో, బాడీగార్డ్ గా కనిపిస్తాడనో అంచనాలతో వచ్చినవాళ్లకు ఈ విషయం మింగుడుపడలేదు. సరైనోడు కోసం ఇచ్చిన ఫస్ట్ లుక్ - బాడీ సైజ్ - హైప్ లాంటి వన్నీ బన్నీని పోలీస్ గా చూపించనున్నారనే అంచనాలు పెంచేశాయి. కానీ ఆశ్చర్యకరంగా అలాంటి ఎటెంప్ట్ చేయలేదు.

అయితే.. ఇలా ప్రచారం జరుగుతున్నపుడు పోలీస్ రోల్ కాదని ముందే ఖండించి ఉంటే సరిపోయేది. అఫ్పుడు జనాల అంచనాలు మారేవి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉండేది. ఇవేమీ లేకుండా.. అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు షాక్ ఇవ్వాలనే ప్రయత్నం అంతగా సెట్ కాలేదంటున్నారు సినీ జనాలు.