Begin typing your search above and press return to search.
పుష్పలో ఈ షాకింగ్ ట్విస్ట్ జీర్ణించుకోగలరా?
By: Tupaki Desk | 20 April 2020 9:30 AM ISTరామ్ చరణ్ లాంటి అగ్ర హీరోని చెవి వినిపించని తూ.గో చిట్టిబాబులా డీగ్లామరస్ గా చూపించి నూటికి 200 మార్కులు వేయించుకున్నాడు సుక్కూ. అసలు గంగోత్రి సింహాద్రి లాంటి కుర్రాడిని ఆర్య అంత స్టైలిష్ గా చూపించినప్పుడు అతడికి వందకు ఐదు వందల మార్కులు వేశారు జనం. అందుకే ఇప్పుడు పుష్ప (ఏఏ20)లో బన్నీని ఎలా చూపించబోతున్నాడు? అన్న ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్ ని బట్టి అతడు రఫ్ అండ్ ఠఫ్ కుర్రాడిగా కనిపిస్తాడని అర్థమైంది. చిత్తూరు శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలోని సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే మాసీగా బన్ని కనిపిస్తాడని పోస్టర్ క్లారిటీనిచ్చింది. పైగా పుష్ప చిత్రంలో బన్ని ఓ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడన్న టాక్ కూడా అభిమానుల్లో ఎగ్జయిట్ మెంట్ పెంచుతోంది. గంధపు చెక్కల స్మగ్లర్ల జీవితాల్లో ఆటుపోట్లు టెరిఫిక్ లైఫ్ స్టోరీ అంటేనే ఉత్కంఠ పెంచింది. మాసిన గడ్డం.. గుబురు మీసం .. కోర చూపులతో బన్ని పక్కా తిరుపతి-చిత్తూరు కుర్రాడిలా గా కనిపించాడు. ఇకపోతే ఇదొక్కటేనా? ఇంకేమీ లేదా? అంటే ఊహకందని ట్విస్టులను ఈ మూవీలో సుక్కూ రివీల్ చేయనున్నాడన్న సంగతి లీకైంది.
ఇంతకీ ఏమిటా ఊహించని ట్విస్టు? అంటే... ఇందులో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్క్రీన్ ఆద్యంతం వేడెక్కించేయడం ఖాయమని చెబుతున్నారు. బన్ని ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ స్టైలిష్ మాఫియా డాన్ గా కనిపిస్తాడు. అందుకు సంబంధించిన ఫోటోషూట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. తొలిగా ప్రస్తుత డీగ్లామరస్ లుక్ పై సీన్లు అన్నీ తెరకెక్కించేసి అటుపై స్టైలిష్ మాఫియా డాన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తారని తెలిసింది. మొత్తానికి ఈ ట్విస్టు ఊహించనిదే. సినిమాకే హైలైట్ గా ఉంటుందని ఫ్యాన్స్ గెస్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. 2021 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉన్నా.. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ల కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. అందుకే రిలీజ్ కూడా చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.