Begin typing your search above and press return to search.

రుద్రమ దేవి తరువాత మళ్ళీ అలాంటి పాత్రలో బన్నీ!

By:  Tupaki Desk   |   5 Aug 2021 9:51 AM GMT
రుద్రమ దేవి తరువాత మళ్ళీ అలాంటి పాత్రలో బన్నీ!
X
పుష్ప చిత్రంతో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక క్యామియో లో మెరవబోతున్నాడా, అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తమిళ చిత్రం ఓ మై కడవుల్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో విశ్వక్ సేన్ తో రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఒక క్యామీయో పాత్ర కోసం అల్లు అర్జున్ ని సంప్రదించే యోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.అన్నీ కుదిరి అల్లు అర్జున్ గనక ఒప్పుకుంటే, ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. చూడాలి మరి బన్నీ ఎం చేస్తాడో.ఒరిజినల్ చిత్రం లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ క్యామియో కనిపించారు.

ఇంతకు ముందు బన్నీ, జేజమ్మ అనుష్క నటించిన రుద్రమ దేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో ఎక్కువ నడివి ఉండే క్యామియో లో కనిపించారు.