Begin typing your search above and press return to search.

సైరా బ‌డ్జెట్ ఎంతో లీక్ చేసిన బ‌న్ని

By:  Tupaki Desk   |   22 Aug 2018 4:05 AM GMT
సైరా బ‌డ్జెట్ ఎంతో లీక్ చేసిన బ‌న్ని
X
ఇన్నాళ్లు సైరా బ‌డ్జెట్ ఎంత‌? అంటే స‌రైన స‌మాధానం లేదు. 200 కోట్లు అని - లేదు 300 కోట్లు అని ర‌క‌ర‌కాలుగా మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. కొంద‌రైతే అన్‌ లిమిటెడ్ బ‌డ్జెట్ అని చెబుతున్నారు. నిన్న‌టిరోజున టీజ‌ర్ ఈవెంట్‌ లో సైరా బ‌డ్జెట్ ఎంత‌? అన్న ప్ర‌శ్న‌కు నిర్మాత రామ్‌ చ‌ర‌ణ్ సైతం ఏ క్లారిటీ ఇవ్వ‌లేదు. నాన్న‌గారికి కావాల్సిన‌ట్టు సినిమా తీయ‌డానికి ఎంత‌యినా ఖ‌ర్చు చేస్తాం. అందులో రాజీకి రాలేమ‌ని రామ్‌ చ‌ర‌ణ్ తెలిపారు. నాన్న‌కు ఓ విజువ‌ల్ వండ‌ర్‌ ని కానుక‌గా ఇవ్వాలి. నా రెండో సినిమానే ఒక సోషియో ఫాంట‌సీ. ఈ విష‌యంలో నాన్న‌గారు జెల‌సీ ఫీల‌య్యారు. అందుకే త‌న‌కు ఓ వార్ ఎపిక్‌ ని కానుక‌గా ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని రామ్‌ చ‌ర‌ణ్ అన్నారు. అయితే ఎక్క‌డా బ‌డ్జెట్ ఇంత అని మాత్రం ప్ర‌స్థావించ‌లేదు.

అయితే సైరా బ‌డ్జెట్‌పై నిన్న‌టి సాయంత్రం ఫ్యాన్స్ మీట్‌ లో క్లారిటీ వ‌చ్చేసింది. `సైరా` నిర్మాత రామ్‌ చ‌ర‌ణ్ కొన్ని విష‌యాలు చెప్ప‌డానికి మొహ‌మాట ప‌డుతున్నాడంటూ అస‌లు నిజాన్ని స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ రివీల్ చేశారు. టీజ‌ర్ ఈవెంట్‌ కి మెగాస్టార్ రాక‌పోవ‌డానికి కార‌ణాన్ని విశ్లేషిస్తూ బ్ర‌హ్మాస్త్రాన్ని ఎప్పుడు వాడాలో చ‌ర‌ణ్‌ కు తెలుస‌ని - చిరు క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిమానంతోనే అలా అడిగార‌ని అన్నాడు బ‌న్ని. ఫ్యాన్స్ ఈవెంట్‌ లో మావ‌య్య‌పై త‌న‌కున్న ప్రేమ‌ను ఆవిష్క‌రించాడు బ‌న్ని. సైరా బ‌డ్జెట్ ఎంత‌? అంటే.. ఖైదీనంబ‌ర్ 150 వ‌సూళ్ల‌కు డ‌బుల్ బ‌డ్జెట్ ఉంటుంద‌ని త‌న‌దైన శైలిలో వివ‌ర‌ణ ఇచ్చాడు.

మొత్తానికి టీజ‌ర్ వేడుక‌లో రాని క్లారిటీ.. ఫ్యాన్స్ మీట్లో వ‌చ్చేసింది. అస‌లు సీక్రెట్‌ ని బ‌న్ని లీక్ చేసేశాడు. ఖైదీనంబ‌ర్ 150 బాక్సాఫీస్ వ‌ద్ద 150 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. దానికి డ‌బుల్ బ‌డ్జెట్ అంటే 300 కోట్లు `సైరా` కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇది ఇంచుమించు బాహుబ‌లి 2 బ‌డ్జెట్‌ కి స‌మానం అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు స‌హా సౌత్‌ లో అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయ‌డం అస‌లు ల‌క్ష్యం అని చ‌ర‌ణ్ చెప్పారు. అయితే ఈ సినిమాని ఇండియా వైడ్‌ - చైనాలోనూ రిలీజ్ చేసే ఆస్కారం ఉంద‌న‌డంలో సందేహం లేదు.