Begin typing your search above and press return to search.

మెగా 'గారు'లు మింగుడుపడ్డం లేదు

By:  Tupaki Desk   |   11 May 2018 6:53 AM GMT
మెగా గారులు మింగుడుపడ్డం లేదు
X
ప్రేమతో వడ్డించే గారెలు అయితే చకచకా లాగించేయచ్చు. అలాగే గౌరవంతో పిలిచే గారు పదం కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ గారులు ఎక్కువయిపోతే ఎలా ఉంటుందో.. నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా థ్యాంక్యూ మీట్ లో మెగా ఫ్యాన్స్ కు బాగా అర్ధం అయింది.

కొన్ని రోజుల క్రితం రంగస్థలం సక్సెస్ మీట్ కు వచ్చిన పవన్ కళ్యాణ్.. 'వీడు నా తమ్ముడు' అంటూ రాంచరణ్ ను ఉద్దేశించి అన్నాడు. అప్పుడు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. నిన్నటికి నిన్న నా పేరు సూర్యూ థ్యాంక్యూ ఇండియా మీట్ కు వచ్చిన పవన్.. అల్లు అర్జున్ గారు అంటూ బన్నీని ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి.. అందరినీ గారు అనడం అలవాటు కావడం సహజమే కానీ.. అన్ని సార్లు అల్లు అర్జున్ గారు.. గారు అంటుంటే మాత్రం అభిమానులకు ఆ గారులు మింగుడుపడలేదు.

అఫ్ కోర్స్.. బన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అనే అన్నాడు లెండి. అంతెందుకు నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా శ్రీ రాంచరణ్ గారు అనే సంబోధించాడు అల్లు అర్జున్. నిజానికి చెర్రీ-బన్నీ తమ వ్యక్తిగత జీవితంలో ఇలా ఉండరు. మాంచి క్లోజ్ కూడా. కానీ పబ్లిక్ లోకి వచ్చేసరికి ప్రొఫెషనలిజం చూపించారు అంతే. చిరంజీవి నుంచి నేర్చుకున్న అంశాలను పక్కాగా అమల్లో పెట్టేస్తున్నారు. కాకపోతే రంగస్థలం మూవీ తెగ నచ్చేసిన పవన్ మాత్రం.. ఆ రోజు కాసింత ఓపెన్ అయిపోయాడంతే.