Begin typing your search above and press return to search.

బన్నీ వద్దన్న కథ అక్కడ నచ్చిందా?

By:  Tupaki Desk   |   14 March 2018 11:26 AM IST
బన్నీ వద్దన్న కథ అక్కడ నచ్చిందా?
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొంత కాలంగా విజయలే కానీ ఓటమిని ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. మినిమామ్ మాస్ అయ్యి ఉండాలని మసాలా కాన్సెప్ట్ పై దృష్టి పెడుతున్నాడు. మొదట్లో ఎమోషనల్ మెస్సేజ్ కాన్సెప్ట్ సినిమాలను బాగానే చేశాడు. వేదం - వరుడు వంటి సినిమాలు ప్రయోగలుగా నిలిచాయి గాని వసూళ్లు మాత్రం గొప్పగా అందలేదు. ఇక సరైనోడు హిట్టు పడగానే మళ్లీ అదే తరహాలో దువ్వడా జగన్నాథమ్ సినిమాని చేశాడు.

అయితే ప్రస్తుతం ఆర్మీ రోల్ లో నా పేరు సూర్య సినిమాలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇది కూడా మాస్ గా ఉండనుంది. ఇక తరువాత సినిమాను బన్నీ కమర్షియల్ తరహాలో చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఎలాంటి ప్రయోగాలు వచ్చినా కూడా ఒప్పుకోవడం లేదట. ఇటీవల విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పిన కథ కూడా కొంచెం డిఫెరెంట్ జానర్ అని బన్నీ రిజెక్ట్ చేశాడట. అయితే ఆ కథని ఇప్పుడు బాలీవుడ్ హీరో ఒకే చేయడం హాట్ టాపిక్ అయ్యింది. డిఫెరెంట్ కథలు వస్తే డౌట్ లేకుండా ఒకే చేసే అక్షయ్ కుమార్ విక్రమ్ కథను ఒకే చేసినట్లు సమాచారం. ఆ కథ కొంచెం కొత్తగా అనిపించడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అంతే కాకుండా ఈ దర్శకుడు ఇదివరకే మాధవన్ తో తన మొదటి సినిమా 13B ని బాలీవుడ్ లో తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. అప్పుడే విక్రమ్ కి మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఈ దర్శకుడు తాను అనుకున్న కథలనే మాత్రమే చేసుకుంటూ వెళ్లాడు. జూన్ లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.