Begin typing your search above and press return to search.

క్లారిటీతో నో చెప్పేసిన బన్నీ

By:  Tupaki Desk   |   3 Dec 2018 6:52 AM GMT
క్లారిటీతో నో చెప్పేసిన బన్నీ
X
ఇతర బాషల్లో ఎంత పెద్ద హిట్ అయిన సినిమాలైనా రీమేక్ చేయాలి అనుకున్నప్పుడు సదరు హీరో తన బాడీ లాంగ్వేజ్ కి ఇమేజ్ అది సెట్ అవుతుందా లేదా అని చూసుకోవడం చాలా అవసరం. లేదంటే పక్క బాషలో క్లాసిక్ అనిపించుకున్నది ఇక్కడ డిజాస్టర్ అయిపోతుంది. గతంలో విక్రంకి పెద్ద బ్రేక్ ఇచ్చిన సేతుని ఇలాగే రాజశేఖర్ రీమేక్ చేస్తే ఏమైందో ఫలితం గుర్తున్న ప్రతిఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు తమిళ్ లో కల్ట్ క్లాసిక్ గా విమర్శకులను సైతం మెప్పించిన 96 రీమేక్ గురించి గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. నాని చేస్తాడని టాక్ వచ్చింది కానీ జెర్సి తో పాటు విక్రమ్ కుమార్ మూవీకి బ్లాక్ అయిపోవడంతో నో చెప్పేసాడు.

అల్లు అర్జున్ ఇంతకుముందే ప్రత్యేకంగా షో వేయించుకుని చూసాడు. దాని రీమేక్ హక్కులు కొన్న దిల్ రాజు బన్నీ ఏమైనా ఓకే చెప్తాడేమో అని ఎదురు చూసినట్టుగా కూడా టాక్ ఉంది. కానీ ఫైనల్ గా బన్నీ 96 రీమేక్ తనకు సెట్ అవ్వదని డ్రాప్ అవుతున్నట్టుగా దిల్ రాజు కు స్పష్టంగా చెప్పేశాడట. దీంతో దిల్ రాజు మరో ఆప్షన్ వెతికే పనిలో సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. నిజానికి 96 రీమేక్ అల్లు అర్జున్ చేయొచ్చు అనే టాక్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కొంత ఖంగారు పడ్డారు. మరీ అంత ఫీల్ గుడ్ స్లో స్టోరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి నిజంగానే సెట్ కాదు.

ఏదో ప్రయోగం పేరుతో చేసినా కథ ఫలితం ఇవ్వలేకపోతే నా పేరు సూర్య తర్వాత కోరి మరీ తీసుకున్న ఏడు నెలల ఎదురుచూపులు వృధా అయిపోతాయి. అందుకే అన్ని కోణాల్లో అలోచించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఎలాగూ వర్క్ జరుగుతోంది కాబట్టి ఇంకొద్ది రోజులు ఆగాలి తప్పించి 96 వద్దనుకున్నట్టు తెలిసింది. దిల్ రాజు గోపీచంద్ తో చేయించే ఆలోచన చేస్తున్నట్టు టాక్. హీరో ఫైనల్ కాకపోయినా దర్శకుడు ప్రేమ్ కుమార్ మాత్రం తెలుగు వర్క్ మొదలుపెట్టినట్టు వినికిడి