Begin typing your search above and press return to search.
మరోసారి మురిసి పోయిన పుష్ప రాజ్
By: Tupaki Desk | 3 Jan 2022 8:00 PM ISTఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఆయన నటించిన పుష్ప సినిమా విడుదల అయ్యి 300 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుని ఇంకా కూడా మంచి వసూళ్లను రాబడుతూ సినీ ప్రముఖుల ప్రశంసలు.. అభిమానుల ప్రశంసలు దక్కించుకుంటూ ఉంది. దేశ వ్యాప్తంగా కూడా పుష్ప సినిమా భారీ వసూళ్లను దక్కించుకోవడమే కాకుండా జాతీయ స్థాయి స్టార్స్.. సెలబ్రెటీలు.. ఇతర భాషల సెలబ్రెటీలు కూడా సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి సినిమా చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే. ఇప్పుడు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ పుష్ప సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు.
శరత్ కుమార్ ట్విట్టర్ లో.. పుష్ప సినిమా ను ఈ రోజు చూశాను. అల్లు అర్జున్ నటన చాలా ఎనర్జిటిక్ గా బాగుంది. అల్లు అర్జున్ కు.. దర్శకుడు సుకుమార్ కు ..మైత్రి మూవీ మేకర్స్ కు మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశాడు. శరత్ కుమార్ ట్వీట్ కు అల్లు అర్జున్ స్పందించాడు. థ్యాంక్యూ వెరీ మచ్ శరత్ గారు. మీకు నా నటన నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమకు కృతజ్ఞతలు అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు. శరత్ కుమార్ మాత్రమే కాకుండా ప్రతి రోజు ఎవరో ఒకరు స్టార్ లేదా ప్రముఖులు ట్వీట్ చేయడం వారికి బన్నీ మురిసి పోతూ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం తో పాటు ఇలాంటి ప్రశంసలు దక్కితే ఏ హీరోకు అయినా రెట్టింపు ఉత్సాహం దక్కడం ఖాయం.
తెలుగు సినిమా పరిశ్రమ నుండి మాత్రమే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 2021 లో విడుదల అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా పుష్ప నిలిచింది. పుష్ప సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుని అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమాను సైతం క్రాస్ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ కు కాస్త ముందు వచ్చి లక్కీగా పుష్ప బచాయించాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో అభిమానులు అల్లు అర్జున్ ఉంటే కరోనా ఉండదు.. కరోనా ఉంటే అల్లు అర్జున్ ఉండడు అన్నట్లుగా మీమ్స్ చేస్తూ ఉన్నారు. గత ఏడాది లో విడుదల అయిన అతి తక్కువ సినిమాల్లో పుష్ప ఒకటి. అయినా కూడా లక్కీగా కరోనా బారిన పడకుండా సేఫ్ గా బయట పడింది. ఉత్తరాదిన ఒమిక్రాన్ ప్రభావం ఉన్నా కూడా 50 కోట్లకు పైగా అక్కడ వసూళ్లు రాబట్టింది. ఒమిక్రాన్ ప్రభావం లేకుండా ఉంటే అక్కడా మరో పాతిక కోట్ల వరకు అయినా రాబట్టేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.