Begin typing your search above and press return to search.
బన్ని- చరణ్ - తారక్ 'స్టైల్ 2'?
By: Tupaki Desk | 19 April 2019 1:30 AMహాలీవుడ్ లో వచ్చిన స్టెపప్ సిరీస్ సంచలనాల గురించి తెలిసిందే. డ్యాన్స్ బేస్డ్ కథాంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ లో డ్యాన్సర్లు అథ్లెటిక్ ఫీట్స్ తో ఊపిరి సలపనివ్వరు. థియేటర్లలో చూస్తున్నంత సేపూ ఊగిపోవాల్సిందే. ఆ సిరీస్ స్ఫూర్తితోనే బాలీవుడ్ లో ఏబీసీడీ సిరీస్ మొదలైంది. అక్కడా బంపర్ హిట్. బుల్లితెర డ్యాన్స్ రియాలిటీల్లోనూ మెజారిటీ భాగం సక్సెస్ ఉంది. అందుకే డ్యాన్స్ బేస్డ్ సినిమాలంటే అందరికీ ఆసక్తి.
అయితే సరిగ్గా స్టెపప్ తరహాలోనే టాలీవుడ్ లో స్టైల్ అనే ఓ ప్రయోగం చేశారు లారెన్స్ మాస్టార్. 2006లో ఈ సినిమా రిలీజైంది. లారెన్స్.. ప్రభుదేవా .. ఛార్మి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తే మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున అతిధులుగా తళుక్కున మెరుస్తారు. బాక్సాఫీస్ ఫలితం ఏదైనా యువతరంలో చర్చకు తావిచ్చిన సినిమా ఇది. అయితే ఆ సినిమా సీక్వెల్ తెరకెక్కిస్తారని అప్పట్లో వార్తలొచ్చినా ఇప్పటివరకూ కుదరనే లేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ `స్టైల్ 2` గురించిన ఆసక్తికర చర్చ తిరిగి మొదలైంది. ఒకవేళ ఈ సినిమాని తీయాలని భావిస్తే ఎవరెవరు స్టార్లు గా ఉండాలి? అన్నదానికి లారెన్స్ మాస్టర్ మతి చెడే ఆన్సర్ ఇచ్చారు.
హైదరాబాద్ లో జరిగిన `కాంచన 3` ఈవెంట్ లో లారెన్స్ మాస్టార్ తన చెంతనే ఉన్న స్టైల్ నిర్మాత లగడపాటి శ్రీధర్ గురించి ప్రస్థావిస్తూ ఆయనతో స్టైల్ సినిమా చేశాను. ఇప్పుడు ఆయనే స్టైల్ 2 చేద్దామంటున్నారు. తప్పకుండా చేస్తాను. డ్యాన్స్ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్ చేసే వాళ్లలో బన్ని- చరణ్- తారక్ బాగా చేస్తారు. అన్నయ్య (చిరంజీవి) గురించి ఈ సందర్భం లో చెప్పలేదని అనుకోవద్దు.. ఎందుకంటే ఆయనే అన్నింటికీ బాస్. కాబట్టి స్టైల్ 2 చేసేటప్పుడు పెద్ద హీరోలతో ప్లాన్ చేయాలి అని లారెన్స్ తన మనసులోని మాటను బయటపెట్టారు. మాస్టార్ ఆలోచన బాగానే ఉంది. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ ముగ్గురిని కలిపి మెగాస్టార్ కీలక పాత్రలో ఈ డ్యాన్స్ బేస్డ్ సినిమా చేస్తే బాగానే ఉంటుందని ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి అది ఎప్పటికి కుదిరేనో?