Begin typing your search above and press return to search.

చరణ్‌ కు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సూటి ప్రశ్న

By:  Tupaki Desk   |   11 Feb 2020 9:00 AM GMT
చరణ్‌ కు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సూటి ప్రశ్న
X
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాను చిత్రంను ప్రశంసిస్తూ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ పెట్టాడు. తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుని అందరికి సుపరిచితం అయిన సినిమాను రీమేక్‌ చేయడం అంటే చాలా పెద్ద కష్టం. కాని సమంత మరియు శర్వానంద్‌ లు కష్టపడి ఈ చిత్రం సక్సెస్‌ చేశారు. చిత్ర యూనిట్‌ ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాట్స్‌ అంటూ చరణ్‌ పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్‌ కు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సీరియస్‌ గా కామెంట్స్‌ చేస్తున్నారు.

అల వైకుంఠపురంలో చిత్రం విడుదలైన సమయంలో అమెరికాలో ఉన్న రామ్‌ చరణ్‌ సినిమా గురించి స్పందించాలంటూ కోరితే తాను ఇంకా సినిమా చూడలేదని.. యూఎస్‌ లో ఉండటం వల్ల చూడటం కుదరలేదు అంటూ సమాధానం ఇచ్చాడు. కాని ఇప్పుడు అదే చరణ్‌ అమెరికాలో ఉన్న సమయంలో జానును ఎలా చూశాడు అంటూ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కడుపు మండి పోతుందట. బన్నీ సినిమా గురించి రెండు ముక్కలు పాజిటివ్‌ గా రెస్పాండ్‌ అయ్యేందుకు చరణ్‌ కు వచ్చిన నష్టం ఏంటీ అంటూ బన్నీ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలా కాలంగా రామ్‌ చరణ్‌.. అల్లు అర్జున్‌ ల మద్య కోల్డ్‌ వార్‌ నడుస్తుందనే పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. కాని ఇద్దరు మెగా హీరోలు కూడా తమ మద్య అలాంటిది ఏమీ లేదని.. ఇద్దరం కూడా మంచి స్నేహంగా ఉంటామని చెప్పారు. కాని ఇప్పుడు అల వైకుంఠపురంలో చిత్రంపై స్పందించకుండా స్నేహితుడు శర్వానంద్‌ జాను సినిమాపై చరణ్‌ స్పందించడంతో మళ్లీ కోల్డ్‌ వార్‌ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.