Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : పుష్పలో ఇలా అడుగు పెట్టిన బంటు

By:  Tupaki Desk   |   12 Nov 2020 2:30 PM GMT
ఫొటోటాక్‌ : పుష్పలో ఇలా అడుగు పెట్టిన బంటు
X
అల వైకుంఠపురంలో సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న అల్లు అర్జున్‌ పుష్పలో నటించేందుకు గత ఏడాదిలోనే ఓకే చెప్పిన విషయం తెల్సిందే. పలు కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. మారేడుమిల్లి అటవి ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంటున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా షూటింగ్‌ లో బన్నీ ఎలాంటి లుక్‌ లో కనిపించబోతున్నాడు అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

నేడు షూటింగ్‌ సెట్‌ లో పుష్పగా అల్లు అర్జున్‌ జాయిన్‌ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు. బన్నీని వెనుక నుండి ఫొటో తీసి దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. షూటింగ్‌ ప్రారంభం అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్ని రోజుల వెయిటింగ్‌ కు ఫుల్‌ స్టాప్‌ పడింది. హిట్‌ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందని అభిమానులు ఇప్పటి నుండే నమ్మకంగా చెబుతున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతుంది. అల్లు అర్జున్‌ మరియు రష్మిక మందన్నా చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు.