Begin typing your search above and press return to search.

అడవుల్లో పుష్ప లారీ చేజింగ్స్‌ నభూతో నభవిష్యతి

By:  Tupaki Desk   |   1 May 2020 2:23 PM IST
అడవుల్లో పుష్ప లారీ చేజింగ్స్‌ నభూతో నభవిష్యతి
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ కరోనా లాక్‌ డౌన్‌ లేకుండా ఉంటే కేరళలో ఒక భారీ షెడ్యూల్‌ ను షూట్‌ చేస్తూ ఉండే వారు. కేరళ అడవుల్లో లారీ చేజ్‌ సీన్స్‌ తో పాటు పలు యాక్షన్‌ సీన్స్‌ ను దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేశాడు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దుంగల స్మగ్లర్‌ గా అల్లు అర్జున్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. చిత్తూరు యాసతో ఒక పల్లెటూరు కుర్రాడి పాత్రలో అల్లు అర్జున్‌ లుక్‌ ఇప్పటికే ఆయన బర్త్‌ డే కానుకగా విడుదల అయ్యింది.

ఫస్ట్‌ లుక్‌ వచ్చినప్పటి నుండి కూడా ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అల వైకుంఠపురంలో చిత్రంతో బన్నీ.. రంగస్థలం చిత్రంతో సుకుమార్‌ ఇండస్ట్రీ హిట్‌ కొట్టి ఉన్నారు. కనుక వీరిద్దరి కాంబోలో మరో ఇండస్ట్రీ హిట్‌ ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన వార్తలు ప్రతి రోజు ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

లారీ డ్రైవర్‌ అయిన పుష్ప రాజ్‌ పోలీసులతో చేసే చేజింగ్స్‌ అద్బుతంగా ఉంటాయట. సినిమా మొత్తంలో పలు సీన్స్‌ లో దాదాపుగా 20 నిమిషాల పాటు చేజింగ్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయట. అవి నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉంటాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. సాదారణం గానే దర్శకుడు ఇలాంటి సీన్స్‌ ను తన క్రియేటివిటీ తో అద్బుతంగా చిత్రీకరిస్తాడు. అలాంటిది లారీల చేజింగ్‌ సీన్స్‌ అంటే మరింత హైలైట్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

పుష్పలోని ప్రతి ఎలిమెంట్‌ పై దర్శకుడు సుకుమార్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. కథ విషయమై దాదాపుగా ఏడాది కాలం వర్క్‌ చేసిన సుకుమార్‌ అద్బుతమైన స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ గా రష్మిక మందన్న నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సునీల్‌ శెట్టి మరియు కన్నడ నటుడు ధనంజయ నటించనున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ కు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.