Begin typing your search above and press return to search.

చరణ్ vs బన్నీ.. మధ్యలో సుక్కూ..!

By:  Tupaki Desk   |   11 Jan 2022 1:30 AM GMT
చరణ్ vs బన్నీ.. మధ్యలో సుక్కూ..!
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప: ది రైజ్''. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. నార్త్ మార్కెట్ లో ఇప్పటివరకు దాదాపు 80 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. హిందీ వెర్షన్ ఇంకా మంచి కల్లెక్షన్స్ సాధించే అవకాశం ఉండటంతో.. నాలుగు దక్షిణాది భాషల్లో మాత్రమే పుష్ప పార్ట్-1 ని ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టారు.

'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని నెల తిరక్కుండానే జనవరి 7న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిజిటల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సినిమాని చూడని జనాలు ఇప్పుడు ఈ ఓటీటీలో విశేషంగా ఆదరిస్తున్నారు. ఇందులో బన్నీ నటనకు ఫిదా అవుతున్న సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట మెగా ఫ్యాన్స్‌ లో ఆసక్తిరమైన చర్చ కొనసాగుతోంది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' మరియు అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలకు పోలిక పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. సుక్కూ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ ఇదేనంటూ.. చెర్రీ - బన్నీ లలో బెస్ట్ యాక్టర్ ఎవరంటూ సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. రెండిటిలో గొప్ప సినిమా ఏదంటూ వాదోపవాదనలు చేసుకుంటున్నారు.

చెవిటి వాడైన చిట్టిబాబు వంటి అత్యంత క్లిష్టమైన పాత్రలో చరణ్ మెప్పించారని కొందరు అంటుంటే.. అనేక వేరియేషన్స్ ఉన్న పుష్పరాజ్ వంటి ఊర మాస్ పాత్రలో బన్నీ ఒదిగిపోయారని మరికొందరు అంటున్నారు. తమ హీరో పాత్ర చాలా కష్టతరమైనదని వైవిధ్యమైనదని కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి 'రంగస్థలం' 'పుష్ప' సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. అలానే ఇద్దరు మెగా హీరోల కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచాయని చెప్పవచ్చు.

శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' చిత్రాన్ని తెరకెక్కించగా.. ఇందులో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడుతూ మొరటు కుర్రాడిగా అదరగొట్టాడు. రూరల్ బ్యాక్‌ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ తనలోని సరికొత్త నటుడిని అద్భుతంగా ఆవిష్కరించారు. కాకపోతే 'పుష్ప' పాన్ ఇండియా మూవీ కావడంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక త్వరలో రాబోయే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో చరణ్ కూడా కచ్చితంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతారని చెప్పవచ్చు. కాబట్టి అభిమానులు ఇద్దరు హీరోల్లో ఎవరు బెస్ట్ అనే దాన్ని పక్కన పెట్టి.. రెండు సినిమాలు వారి కెరీర్ లోనే బెస్ట్ అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే సుకుమార్ రాబోయే రెండు ప్రాజెక్ట్స్ చెర్రీ - బన్నీ లతో చేస్తున్నారు. 'పుష్ప' పార్ట్-2 తర్వాత చరణ్ తో సుక్కు ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవలే క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.