Begin typing your search above and press return to search.

లెక్కల మాస్టర్ 'పుష్ప' స్టోరీ ఇలా డిసైడ్ చేశాడా...?

By:  Tupaki Desk   |   11 April 2020 7:00 AM GMT
లెక్కల మాస్టర్ పుష్ప స్టోరీ ఇలా డిసైడ్ చేశాడా...?
X
అల్లు అర్జున్ – సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కు‌తున్న చిత్రానికి 'పుష్ప‌' అనే టైటిల్‌ని చిత్ర బృందం ఇటీవ‌ల ఖరారు చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాయలసీమకు చెందిన మొరటు కుర్రాడిగా బన్నీ డీగ్లామర్ లుక్ కేక పుట్టిస్తుంది. మాసిన గెడ్డం మీసాలతో సీరియస్‌గా ఉన్న బన్నీ లుక్ చాలా కొత్తగా ఉంది. అలాగే ఆయన వేసుకున్న షర్ట్ కూడా పాత స్టైల్లో ఉంది. ఒక పోస్టర్ లో బన్నీ లుక్‌ను మాత్రమే చూపించిన సుకుమార్.. రెండో పోస్టర్‌లో మాత్రం గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడినట్లు చూపించాడు. శేషాచ‌లం అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి స్టోరీ ఏమై ఉంటుందని అందరూ ఆలోచించడం స్టార్ట్ చేసారు.

ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఇది ఒక యాక్షన్ అండ్ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కుతున్నదని.. సుక్కు ప్రీవియస్ ఫిల్మ్ 'రంగస్థలం' ఛాయలు కనిపిస్తాయని అందరూ అనుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇది ఒక ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న సినిమా అని, 'పుష్ప' ఒక అమాయక లారీ డ్రైవర్ అని.. అన్యాయంగా తనని ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఇరికిస్తారని.. ఊహించని విధంగా తన కుటుంబానికి అన్యాయం జరిగేలా చేసిన విలన్ పై హీరో పగ ఎలా తీర్చుకుంటాడు అనేదే సినిమా మెయిన్ థీమ్ అని సమాచారం. ఫస్ట్ లుక్ లో సుక్కు ఇచ్చిన హింట్స్ ని బట్టి చూస్తే 'పుష్ప' నేపథ్యం అలానే ఉండబోతోంది అనే ఆలోచన రాకమానదు. మరి ఈ లెక్కల మాస్టారి లెక్కలు ఎలా ఉన్నాయో చెప్పలేంగా. ఈయన గత చిత్రాలను తీసుకున్నా మన లెక్కలు తప్పని చాలాసార్లు నిరూపించాడు. ఈ 'పుష్ప' సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇందులో బ‌న్నీకి జోడీగా లక్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.