Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : ఇదే 'పుష్ప'లో బన్నీ లుక్‌

By:  Tupaki Desk   |   11 Nov 2020 1:30 PM GMT
పిక్‌ టాక్‌ : ఇదే పుష్పలో బన్నీ లుక్‌
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. గత ఏడాదిగా ఏవో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్‌ కోసం యూనిట్‌ సభ్యులు మూడు రోజుల ముందుగానే అక్కడకు చేరుకోగా బన్నీ తాజాగా చేరుకున్నాడు. సుకుమార్‌ ఈ సినిమాలో బన్నీని చాలా విభిన్నంగా చూపించాడు. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్‌ రూపొందిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

పుష్ప సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్‌ గా లారీ డ్రైవర్‌ గా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రఫ్‌ లుక్‌ లో కనిపిస్తూ చిత్తూరు యాసలో బన్నీ మాట్లాడుతూ ఉంటాడు. నేడు బన్నీ రఫ్‌ లుక్‌ తో షూటింగ్‌ లో పాల్గొన్నాడు. ఆ లుక్‌ ఇదే. బన్నీ పెరిగిన జట్టు.. గడ్డంతో చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. అయితే ఆ గడ్డం మరియు జుట్టుతో చాలా స్టైలిష్‌ గా కనిపించిన బన్నీ ఇప్పుడు మాత్రం బాబోయ్‌ అన్నట్లుగా ఉన్నాడు.

ఈ లుక్‌ లో బన్నీని చూడగలరా అభిమానులు అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే పాత్రకు తగ్గట్లుగా అదే కరెక్ట్‌ లుక్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పాత్రకు డిమాండ్‌ చేస్తే అలాంటి లుక్ లో కనిపించినా కూడా అభిమానులు ఒప్పుకుంటారు అని రంగస్థలం సినిమాలో చరణ్‌ పాత్రను బట్టి అర్థం చేసుకోవచ్చు. కనుక పుష్ప రాజ్‌ మరో చిట్టిబాబుగా ఖచ్చితంగా ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తుంది.