Begin typing your search above and press return to search.

పుష్ప రెండు పార్ట్‌ ల బడ్జెట్‌ ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   14 May 2021 5:30 AM GMT
పుష్ప రెండు పార్ట్‌ ల బడ్జెట్‌ ఎంతో తెలుసా?
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా రెండు పార్ట్‌ లుగా రాబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. టాలీవుడ్‌ సినిమాల మార్కెట్‌ పరిధి విపరీతంగా పెరిగింది. ఆ కారణంగానే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌ లకు గాను ఎంత ఖర్చు చేస్తున్నారు.. ఎంత ఈ సినిమా రాబట్టే అవకాశం ఉంది అంటూ అంతా ఆసక్తిగా లెక్కలు వేస్తున్నారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రెండు పార్ట్‌ లకు కలిపి కాస్త అటు ఇటుగా రూ.225 కోట్ల ను మేకర్స్ ఖర్చు చేయబోతున్నారట. భారీ గా బడ్జెట్‌ అవుతున్న కారణంగానే సినిమాను రెండు పార్ట్‌ లుగా చేసేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్‌ కారణంగానే ఈ సినిమాను రెండు పార్ట్‌ లుగా రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఆ కారణంగా కాస్త బడ్జెట్‌ అధికంగా అవుతుందని కూడా చెబుతున్నారు.

సుకుమార్‌ గత సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఇదే సమయంలో సినిమా మేకర్స్ సైతం సినిమాపై అంచనాలు పెంచేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. స్టార్‌ కాస్ట్‌ తో పాటు టెక్నికల్‌ క్రూ కూడా సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.