Begin typing your search above and press return to search.
'పుష్ప' హిందీ రిలీజ్ విషయంలో మైత్రీ తర్జనభర్జనలు..?
By: Tupaki Desk | 3 Nov 2021 3:31 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''పుష్ప''. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా హిందీ రైట్స్ విషయంలో బన్నీ అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
'అల వైకుంఠపురముతో' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే 'అల..' సినిమా ఆ రేంజ్ సక్సెస్ అవుతుందని ఊహించని మైత్రీ టీమ్.. పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలనే ఆలోచన చేయకముందే కంప్లీట్ హిందీ రైట్స్ ను 25 కోట్లకు అమ్మేసిందట. అయితే అల సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అలానే పాన్ ఇండియా మూవీగా రెండు పార్ట్స్ చేసిన తర్వాత పుష్ప సినిమాపై నేషనల్ వైడ్ మంచి బజ్ ఏర్పడింది. ఇదంతా చూసుకుంటే హిందీ హక్కులను చాలా తక్కువ ధరకే ఇచ్చారని అనుకోవాలి.
అల్లు అర్జున్ తదుపరి సినిమా హిందీ హక్కులు ఇప్పుడు దాదాపు 40 కోట్లు దాకా పలుకుతున్నాయి. 'పుష్ప' థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి ఇంచుమించు 100 కోట్ల వరకు చేసే ఛాన్స్ ఉంది. కానీ 'పుష్ప' రైట్స్ ను మాత్రం పాతిక కోట్లకే ఇచ్చేసారని అంటున్నారు. దీనికి తోడు ఈ సినిమా హిందీ రిలీజ్ విషయంలో సమస్య వచ్చి పడిందట. రైట్స్ తీసుకున్న థర్డ్ పార్టీ ఈ సినిమా థియేటర్ విడుదలకు మొగ్గు చూపకుండా.. అన్ని తెలుగు డబ్బింగ్ సినిమాల మాదిరిగానే యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. హిందీ రైట్స్ మరియు రిలీజ్ విషయంలో ఇప్పుడు అల్లు అర్జున్ కాస్త సీరియస్ గా ఉన్నారట.
హిందీ రైట్స్ - రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీగా మాట్లాడాలని బన్నీ నిర్మాతలని ఆదేశించారట. ఇప్పుడు మైత్రీ టీమ్ హిందీ డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నారట. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామన్నా థర్డ్ పార్టీ వినడం లేదట. రెండు భాగాలుగా చేశారు కాబట్టి మరో 15 కోట్ల వరకు చెల్లించి.. రైట్స్ తన వద్దే ఉంచుకుంటానని అంటున్నారట. అలానే కొన్ని కండిషన్స్ తో 'పుష్ప' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సదరు వ్యక్తి సుముఖత వ్యక్తం చేసారట. సినిమా పబ్లిసిటీతో పాటుగా థియేటర్ ఖర్చులు పెట్టుకుంటే బిగ్ స్క్రీన్ మీద విడుదల చేస్తానని చెబుతున్నారట. దీనిపై మైత్రీ మేకర్స్ 'పుష్ప' హిందీ విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారట.
థర్డ్ పార్టీ కండిషన్స్ కు ఒప్పుకుంటే నిర్మాతలకు ఆదాయం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే.. అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే దీని గురించి ప్రొడ్యూసర్స్ ఇప్పుడు డిస్కష్ చేసుకుంటున్నారట. వచ్చే నెలలోనే రిలీజ్ డేట్ ఉండటంతో వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నారట. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.