Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేస్తున్న‌ పుష్ప‌రాజ్‌

By:  Tupaki Desk   |   5 March 2022 12:30 AM GMT
మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేస్తున్న‌ పుష్ప‌రాజ్‌
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప ది రైజ్‌` పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి త‌న క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితాన్ని అందించింది. రెండు భాగాలుగా తెర‌పైకి రానున్న ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో బ‌న్నీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో సినిమాని వ‌న్ మ్యాన్ ఆర్మీగా న‌డిపించిన తీరు, శ్రీ‌వ‌ల్లి పాట‌లో ప‌లికించిన మేన‌రిజ‌మ్స్ వెర‌సి సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంది.

ఊహించ‌ని స్థాయిలో తెలుగు ద‌క్షిణాదిని మించి ఉత్త‌రాదిలో `పుష్ప` వ‌సూళ్ల వ‌ర్షం కురిపించ‌డం.. 100 కోట్ల‌కు మించి క‌లెక్ట్ చేయ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. త‌న పంధాకు పూర్తి భిన్నంగా డీగ్లామ‌ర్ గా ఊర‌మాసీవ్ పాత్ర‌లో న‌టించిన మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా త‌న‌ని పాన్ ఇండియా స్టార్ గా మార్చ‌డంతో బ‌న్నీ ఆ ఆనందాన్ని గ‌త కొన్ని రోజులుగా ఫ్యామిలీతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

సినిమా రిలీజ్ త‌రువాత దుబాస్ లో విశ్రాంతి తీసుకున్న బ‌న్నీ ప్ర‌స్తుతం ఆధ్యాత్మిక యాత్ర‌లో భాగంగా వృశీకేష్ లో ప‌ర్య‌టిస్తున్నారు. వారం పాటు అక్క‌డే వుండి వివిధ క్షేత్రాల‌ని ద‌ర్శించి తిరిగి ఈ వారాంతంలో హైద‌రాబాద్ చేరుకోనున్నారు. వచ్చే వారం దర్శ‌కుడు సుకుమార్ తో బ‌న్నీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కాబోతున్నార‌ట‌. పార్ట్ 2కు సంబంధించిన‌ స్క్రిప్ట్ చ‌ర్చ‌ల్లో పాల్గొంటార‌ట‌. ఆ త‌రువాత వారం నుంచి ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేసి ఏప్రిల్ నుంచి షూట్ కి వెళ్ల‌డానికి రెడీ అవుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఫైన‌ల్ స్క్రిప్ట్ ప‌ర్‌ఫెక్ట్ గా లాక్ అయిన త‌రువాతే షూట్ కి వెళ్లాల‌ని బ‌న్నీ, సుక్కు అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే మేక‌ర్స్‌ `పుష్ప 2`లో కీ రోల్ పోషిస్తున్న మ‌ల‌యాళ న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్ డేట్స్ ని ఫైన‌ల్ చేసేశార‌ట‌.

ఇత‌ర చిత్రాల‌తో బిజీగా వుండ‌టంతో ఫాహ‌ద్ త‌న రోల్‌, డేట్స్ కి సంబంధించి ఇప్ప‌టికే మేక‌ర్స్ కి తెలియ‌జేశార‌ట‌. ఫాహాద్ తో పాటు సునీల్‌, అన‌సూయ కూడా కీల‌క పాత్ర‌ల‌ని పోషించ‌బోతున్నారు. పార్ట్ 1లో సునీల్ కొంత వ‌ర‌కు మెరిసినా అన‌సూయ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. కానీ పార్ట్ 2లో మాత్రం ఫాహాద్ తో పాటు ఈ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు స్కోప్ వుంటుంద‌ని తెలిసింది.

ఫ‌స్ట్ పార్ట్ కి అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించ‌డంతో పార్ట్ 2ని కూడా అంత‌కు మించిన స్థాయిలో అద‌ర‌గొట్టాల‌ని దేవిశ్రీ‌ప్ర‌సాద్ ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. ఇప్ప‌టికే కొన్ని పాట‌ల‌కు సంబంధించిన ట్యూన్స్‌ని పూర్తి చేసిన దేవి ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో వ‌రుసగా మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నార‌ని తెలిసింది. ఇక ఫైన‌ల్ స్క్రిప్ట్ లో మ‌రిన్ని మార్పులు చేసి సినిమాని త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్‌, మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.