Begin typing your search above and press return to search.

ఈసారి బ‌న్నీ కామెడీ ట్రై చేస్తాడ‌ట‌

By:  Tupaki Desk   |   15 May 2018 5:30 PM GMT
ఈసారి బ‌న్నీ కామెడీ ట్రై చేస్తాడ‌ట‌
X
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు అల్లు అర్జున్‌. మరీ ఫ్లాపు కాక‌పోయినా అనుకున్న రేంజ్‌లో అయితే సినిమా ఆడ‌లేదు. ఆ సినిమాలో కోపంతో ఊగిపోయే న‌వ‌యువ‌కుడిగా న‌టించాడు. ఏదో సినిమా చూసి కాస్త రొటీన్ లైఫ్ నుంచి సేద దీరుదామ‌ని థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుడికి చిరాకుడు ప‌రాకులు కోపాలు ఎదురైతే ఎలా ఉంటుంది? నా పేరు సూర్య‌లో ఊ అంటే చాలు హీరోకు కోపం న‌షాళానికి అంటేస్తుంది. దీని వ‌ల్లే సినిమా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదేమో అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకేనేమో ఈసారి బ‌న్నీ కామెడీ ట్రై చేస్తాడ‌ట‌.

జులాయి రేసుగుర్రం సినిమాల‌లో బ‌న్నీ కాస్త కామెడీ కూడా చేశాడు. ఆ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేశాయ్‌. ఇప్ప‌టికీ టీవీల్లో ఆ సినిమాలు వ‌స్తే టీఆర్పీ రేటింగ్‌లు ఏమాత్రం త‌గ్గ‌వు. అలా కాస్త హీరోయిజం కాస్త కామెడీ క‌ల‌బోసుకుని చేసుకుంటూ పోతే బ‌న్నీకి తిరుగే ఉండ‌దు. కానీ ఎందుకో నా పేరు సూర్య‌లో పూర్తి సీరియ‌స్ క్యారెక్ట‌ర్ అయిపోయింది. అందుకేనేమో త‌రువాత వ‌చ్చే బ‌న్నీ సినిమా పూర్తి కామెడీ ట‌చ్‌ తో ఉంటుంద‌ట‌. కామెడీ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించేసుకున్నాడు అల్లువారి హీరో. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌రు క‌థేంటీ అనేవి ఇంకా ఖ‌రారు కాలేదు. ఎవ‌రైతే మంచి కామెడీ క‌థ‌తో వ‌స్తారో వారికి ఓకే చెప్పేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడు బ‌న్నీ. త‌న‌లో ఉన్న కామెడీ యాంగిల్ ను వెన‌క్కి నెట్టేయ‌డం బ‌న్నీకి న‌చ్చ‌డం లేద‌నుకుంటా. ఇంత‌వ‌ర‌కు ఈ హీరో పూర్తి స్థాయి కామెడీ సినిమా చేయ‌లేదు. చేస్తే ఎలా ఉంటుందో తెర మీదే చూడాలి.

నా పేరు సూర్య సినిమా విడుద‌ల అయ్యాక ఇంకా ఏ సినిమా ఒప్పుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు బ‌న్నీ. మొన్న‌నే మ‌హాన‌టి సినిమా చూసి బాగా ఫీలై పోయాడు. వెంట‌నే మ‌హాన‌టి టీమ్‌ కు మంచి విందును ఏర్పాటు చేశాడు. ఆ సినిమా చూశాక త‌న‌కు క‌నీసం నిద్ర కూడా ప‌ట్ట‌లేద‌ని అంత బాగా తీశారని మెచ్చుకున్నాడు.