Begin typing your search above and press return to search.

బన్నీ పొగిడితే.. ఇక అందుకేనా??

By:  Tupaki Desk   |   20 July 2017 4:39 AM GMT
బన్నీ పొగిడితే.. ఇక అందుకేనా??
X
సినిమా సెలబ్రిటీలు.. స్టార్లు ఒకరినొకరు ప్రశంసించుకోవడం.. పొగడ్తల జల్లు కురిపించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగితే.. సోషల్ మీడియా దీనికి ఇంకా కలరింగ్ ఇస్తుండడం ఆశ్చర్యకరం. ట్రాఫిక్ అవేర్నెస్ పై హైద్రాబాద్ లో ఓ కార్యక్రమం జరిగితే.. ఇందులో దర్శకధీరుడు రాజమౌళితో పాటు.. హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు.

ట్రాఫిక్ గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నటించిన 'ఐయాం దట్ ఛేంజ్' షార్ట్ ఫిలింని ప్రశంసించాడు రాజమౌళి. అంతకు మునుపే అల్లు అర్జున్ తనకు రాజమౌళి గురించి తెలిసిన విషయాన్ని చెప్పాడు. తాను తన ఫ్రెండ్స్ తో న్యూఇయర్ పార్టీ చేసుకుంటుంటే.. జక్కన్న అండ్ టీం అర్ధరాత్రి పూట ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండడం తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నాడు. బాహుబలి లాంటి సక్సెస్ ను ఇవ్వగల స్టామినానే కాదు.. అంతకు మించిన మంచి మనసుంది అన్నాడు అల్లు అర్జున్. ఇక రాజమౌళి తన ఐ యామ్ చేంజ్ ను అంత ఓపెన్ గా పొగిడాక.. బన్నీ కూడా రెస్పాండ్ కావాలి కాబట్టి.. 'సార్ బాహుబలి తీసి మేమందరం గర్వించేలా చేశారు. థ్యాంక్యూ' అంటూ చెప్పాడు. అప్పుడు రాజమౌళి కూడా బన్నీ భుజం తట్టి థ్యాంక్యూ అన్నాడు. అంతే.. రాజమౌళిని ఇంప్రెస్ చేసేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడని.. రాజమౌళితో సినిమా కోసం తెగ ఆరాటపడుతున్నాడని ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

ఆన్ స్టేజ్ పై బోలెడన్ని మాటలు చెబుతుంటారు. అలాగే అవతలి వ్యక్తి ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. నెగిటివ్ గా మాట్లాడినపుడు ఎలాగూ మీడియాకి బోలెండత సరుకు దొరుకుతుంది. కనీసం పాజిటివ్ గా మాట్లాడినపుడు అయినా.. యాజిటీజ్ గా తీసుకోలేకపోతే ఎలాగండీ.. అయినా రాజమౌళిని పొగిడితే దానికి ప్రతిఫలంగా జక్కన్న సినిమా తీసేస్తాడా ఏంటీ.. అలా అయితే బాహుబలికి వచ్చిన ప్రశంసలకు ప్రతిఫలంగా ఒకేసారి చాలామంది హీరోలతో ఓ వంద సినిమాలు తీయాలి జక్కన్న. ఆ మాత్రం లాజిక్ అల్లు వారబ్బాయికి తెలియదంటారా?