Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ రియల్ టాలెంట్-బన్నీ
By: Tupaki Desk | 13 Jun 2016 7:25 AM GMTనందమూరి హీరోల నోట మెగా హీరోల మాట.. మెగా హీరోల నోట నందమూరి హీరోల మాట వస్తే అందరిలోనూ ఒకరమైన ఆశ్చర్యం కలుగుతుంది. కళ్లప్పగించి చూస్తారు.. చెవులు రిక్కించి వింటారు. ఆదివారం రాత్రి ‘మాటీవీ’ అవార్డుల వేడుక సందర్భంగా ఇలాంటి ఆశ్చర్యకర పరిణామాలే జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాకు గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకుని.. ఆయన తనకు ఇన్ స్పిరేషన్ అని చెప్పాడు. ఆ తర్వాత ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రకు ఉత్తమ నటుడిగా జ్యూరీ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్.. ఎన్టీఆర్ తో కలిసి వేదిక పంచుకోవడమే కాక అతడి మీద ప్రశంసల జల్లు కురిపించాడు. ఎన్టీఆర్ కూడా బన్నీపై పొగడ్తలు గుప్పించాడు.
‘‘ఎన్టీఆర్ అంటే రియల్ టాలెంట్.. అమేజింగ్ ఫ్రెండ్. ఈ జనరేషన్ హీరోల్లో కష్టపడి పైకొచ్చిన వాళ్లలో ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆరే’’ అని అల్లు అర్జున్ తారక్ కు కాంప్లిమెంట్స్ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బన్నీ తనకు చాలా మంచి మిత్రుడని.. ఈ జనరేషన్లో అందరికంటే చాలా కష్టపడతాడని అన్నాడు. బన్నీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రుద్రమదేవి లాంటి హిస్టారికల్ మూవీకి మద్దతుగా నిలిచిన రెండు రాష్ట్రాల వాళ్లకూ ధన్యవాదాలు చెప్పాడు. ఆంధ్రా కుర్రాడు డైలాగ్ తెలంగాణలో క్లాప్స్ కొట్టాలని.. అలాగే తెలంగాణ డైలాగ్స్ కి ఆంధ్రాలో క్లాప్స్ కొట్టాలని.. అందుకే తాను రుద్రమదేవి లాంటి గొప్ప సినిమా చేశానని అన్నాడు. గోన గన్నారెడ్డి పాత్ర తన కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేనిదని బన్నీ అన్నాడు.