Begin typing your search above and press return to search.
ఏజెంట్ ను మెచ్చుకున్న స్టైలిష్ స్టార్
By: Tupaki Desk | 5 July 2019 5:08 PM GMTఈమధ్య రిలీజ్ తెలుగు సినిమాల్లో ప్రేక్షకాదరణతో పాటుగా పాజిటివ్ రివ్యూస్ సాధించిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. నూతన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ద్వారా నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఏఐబీ వీడియోస్ ద్వారా పాపులర్ అయిన నవీన్ నటనకు కూడా అందరి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ లాంటి కొందరు హీరోలు ఏజెంట్ ఆత్రేయను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఏజెంట్ ఆత్రేయ చిత్రాన్ని చూసిన అనంతరం తన ట్విట్టర్ ఖాతా ద్వారా "#ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాను చూశాను. కామెడీ టచ్ ఉండే మంచి థ్రిల్లర్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గొప్ప టాలెంట్ ఉండే న్యూ జెనరేషన్ నటులు & దర్శకులు ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఏజెంట్ ఆత్రేయ టీమ్ అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఇది తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం" అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ తో పాటుగా అల్లు అర్జున్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' దర్శకుడు స్వరూప్.. హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేశాడు. ఏజెంట్ ఆత్రేయ తో ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ ఇద్దరిని తన ఆఫీసులో కలిసి వ్యక్తిగతంగా అభినందనలు తెలిపాడట. ఇండస్ట్రీకి ఇలా న్యూ టాలెంట్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు అభినందించడం ఎంతో గొప్ప విషయం. దీంతో ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయ్యే అవకాశం ఉంది.