Begin typing your search above and press return to search.

బన్నీలో ఆ యాంగిల్ కూడా ఉందా?

By:  Tupaki Desk   |   7 Nov 2017 5:17 PM GMT
బన్నీలో ఆ యాంగిల్ కూడా ఉందా?
X
రాజకీయాల గురించి ఓపెన్ గా డిబేట్ చేయగల ధైర్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ముఖ్యంగా కెమేరా ముందు ఓ రకంగా.. కెమేరా లేకపోతే ఓ రకంగా మాట్లాడడం కూడా సహజమే. అయితే.. పైకి మాత్రం నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా తమ పని తాను చేసుకుపోతూ ఉంటారు. ఏదో ఒక వర్గానికి సపోర్ట్ చేసి.. ఆ పార్టీకి చెందిన వారి అభిమానం పోగొట్టుకోవడానికి ఇష్టపడరు.

అల్లు అర్జున్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు కానీ.. రీసెంట్ గా జరిగిన ఓ పార్టీలో ప్రస్తుత రాజకీయాలపై బన్నీ విశ్లేషణ చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఏపీ.. తెలంగాణ మాత్రమే కాదు.. ఇండియా పాలిటిక్స్ పై కూడా అనర్గళంగా మాట్లాడేసిన బన్నీ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తనకు ఎంతటి పట్టు ఉందనే సంగతి చెప్పకనే చెప్పాడని టాక్. అంతే కాదు.. భవిష్యత్తులో తను కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం ఉందని చెప్పడం అందరినీ షాక్ కు గురి చేసిందని అంటున్నారు.

40ఏళ్ల వయసు దాటిన తర్వాత పాలిటిక్స్ లోకి రావాలని చూస్తున్నట్లు చెప్పాడట బన్నీ. అయితే.. తమ కుటుంబంలో ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన మామయ్యల కంటే బెటర్ ప్లానింగ్ తో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పాడట. అయితే.. సినిమాల్లో క్రేజ్ పెంచుకున్నంత సులభంగా రాజకీయాల్లో రాణించడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. రజినీకాంత్.. కమల్ హాసన్ లాంటి వారే అటూ ఇటూ కొట్టు మిట్టాడుతున్న పరిస్థితిని పలువురు గుర్తు చేస్తున్నారు.