Begin typing your search above and press return to search.

అలా బన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   4 Jun 2018 5:46 AM
అలా బన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఎంత కెర్ఫుల్ గా ఉంటాడో అతను ఎంచుకున్న సినిమాలను చూస్తుంటే అర్ధమవుతుంది. కాస్త కొత్తగా అనిపించినా ప్రాణం పెట్టేస్తాడు. ఇక సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్ ను కూడా ఈ హీరో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో బన్నీ బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ అని చెప్పుకోవాలి. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం అస్సలు మరచిపోడు.

ఇక ఆ హ్యాపీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. రీసెంట్ గా తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ ఉన్న ఒక హ్యాపి మూమెంట్ వీడియోను బన్నీ షేర్ చేసుకున్నాడు. మొత్తం ఆట బొమ్మలను తనపై వేసుకొని భయపెట్టడానికి ట్రై చేసినట్లు ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నా పేరు సూర్య సినిమాతో పరవాలేదు అనిపించుకున్న బన్నీ నెక్స్ట్ సినిమా ను ఇంకా ఫైనల్ చేయలేదు.

కథలు బాగానే వస్తున్నా కూడా ఈ సారి బ్లక్ బస్టర్ కథ అయ్యేలా ఉండాలని అనుకుంటున్నాడట. అందుకు సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు. కొంత మంది యువ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నప్పటికి ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. మరి బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.