Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ఐకాన్ లో సర్ ప్రైజ్ ఇదేనట!

By:  Tupaki Desk   |   14 April 2019 11:23 AM IST
అల్లు అర్జున్ ఐకాన్ లో సర్ ప్రైజ్ ఇదేనట!
X
నాపేరు సూర్య' రిలీజ్ అయి దాదాపు ఏడాది అవుతోంది. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఇంతవరకూ రిలీజ్ కాలేదు. సినిమా సినిమాకు పెద్దగా బ్రేక్ లేకుండా పనిచేసే అల్లు అర్జున్ మొదటిసారి ఇలా గ్యాప్ ఇచ్చినందుకు అభిమానులకు కాస్త నిరాశగానే ఉన్నా ఇప్పుడు మూడు ప్రాజెక్టులు ప్రకటించడంతో ఫుల్ జోష్ వచ్చింది. ఆ మూడు సినిమాలలో మొదటగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా నిన్నే లాంచ్ అయింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్.. ఫైనల్ గా వేణు శ్రీరామ్ - దిల్ రాజు ఫిలిం సెట్స్ మీదకు వెళ్తాయి.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రానున్న 'ఐకాన్' ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకునే ప్రయత్నాలలో ఉన్నారట. అంతే ఆదు.. ఈ సినిమాలో మరో స్పెషాలిటీ కూడా ఉందట. బన్నీ తన కెరీర్ తొలిసారి డబల్ రోల్ లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడట. ఇందులో బన్నీ పోషించే రెండు పాత్రలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయట. బన్నీ తన ప్రతి సినిమాలో గెటప్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఇక డబల్ రోల్ అంటే ఒక పాత్రకు రెండో పాత్రకు సంబంధం లేకుండా తన లుక్ లో కొత్తదనం చూపించడం ఖాయమే.

ఈ జెనరేషన్ హీరోలు డబల్ రోల్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకూ 18 సినిమాలు చేసిన బన్నీ ఒక్కసారి కూడా డబల్ రోల్ చేయలేనదంటేనే మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాటింది ఇప్పుడు ఒప్పుకున్నాడంటే వేణు శ్రీరాం కథలో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది.