Begin typing your search above and press return to search.

స్ట్రెయిట్ హిందీ సినిమా చేసే ప్లాన్ లో అల్లు అర్జున్..?

By:  Tupaki Desk   |   31 May 2021 5:30 PM GMT
స్ట్రెయిట్ హిందీ సినిమా చేసే ప్లాన్ లో అల్లు అర్జున్..?
X
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా అభిమానులతో స్టైలిష్ స్టార్ గా పిలవబడుతున్నాడు. డబ్బింగ్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల మార్కెట్ పై దృష్టి పెట్టిన బన్నీ.. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

'అల వైకుంఠంపురములో' సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్.. ప్రస్తుతం 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'బాహుబలి' 'కేజీఎఫ్ 2' తరహాలో రెండు భాగాలుగా చేస్తుండటం గమనార్హం. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోవాలని చూస్తున్న బన్నీ.. ఇప్పుడు స్ట్రెయిట్ హిందీ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది హిందీ ఇండస్ట్రీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 'ఆదిపురుష్' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాడట. 'పుష్ప' తర్వాత కొరటాల శివ తో చేయాల్సిన మూవీ లేట్ అయ్యే అవకాశాలు ఉండటంతో, బన్నీ ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నాడట. ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శకులతో దీని గురించి చర్చలు కూడా జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఇది జరగాలని కోరుకుంటున్నారు.