Begin typing your search above and press return to search.

అల్లు అయాన్ విషయంలో బన్నీ ప్లాన్ అదేనా..?

By:  Tupaki Desk   |   12 April 2023 10:06 AM GMT
అల్లు అయాన్ విషయంలో బన్నీ ప్లాన్ అదేనా..?
X
అల్లు ఫ్యామిలీ నుంచి రామలింగయ్య గారు గొప్ప నటుడిగా ప్రేక్షకుల మనసులు గెలిచారు. ఆయన కామెడీ టైమింగ్.. ఆయన నటన అందరిని మెప్పించింది. అయితే ఆయన వారసుడు అల్లు అరవింద్ మాత్రం నిర్మాతగా క్రేజ్ తెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్రాండ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐకాన్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అల్లు శిరీష్ కూడా హీరోగా చేస్తున్నా పెద్దగా వర్క్ అవుట్ అవ్వట్లేదు.

అల్లు ఫ్యామిలీ నుంచి రేపటి తరం నటులను ఇప్పుడే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్హ నటించడం మొదలు పెట్టింది. సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్హ నటించింది. సినిమాలో ఆమె పాత్రకు అర్హ అదరగొట్టేసిందని టాక్.

అయితే అల్లు అర్హని ఇంట్రడ్యూస్ చేసిన అల్లు అర్జున్ తనయుడు నట వారసుడు అల్లు అయాన్ విషయంలో మాత్రం టైం తీసుకుంటున్నాడట. అల్లు అర్హని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసిన అల్లు అర్జున్ కొడుకు అయాన్ విషయంలో మెగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

అయాన్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా కాకుండా డైరెక్ట్ గా హీరోగానే పరిచయం చేయాలని అల్లు అర్జున్ ప్లాన్ అని తెలుస్తుంది. అందుకే అతన్ని సినిమాలకు దూరం చేస్తున్నారట. డైరెక్ట్ గా హీరోగా పరిచయం చేస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

అయితే ఈలోగా సినిమా హీరో కి కావాల్సిన అన్ని ట్రైనింగ్ లను ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అయాన్ ప్రస్తుతం చిన్నవాడే కాబట్టి అతను పెద్దయ్యాక హీరోగా తప్పకుండా ఎంట్రీ ఇప్పించాలనేది అల్లు అర్జున్ ప్లాన్. అందుకే అతన్ని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంచుతున్నారట.

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 పోస్టర్ తోనే సెన్సేషన్స్ క్రియేట్ చేశారు. ఇక 3 నిమిషాల వీడియో అదుర్స్ అనిపించింది. సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుంది అని మాత్రం అర్థమవుతుంది.