Begin typing your search above and press return to search.

రేసుగుర్రంలా కోలీవుడ్ లోకి బన్నీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   31 Jan 2016 6:04 AM GMT
రేసుగుర్రంలా కోలీవుడ్ లోకి బన్నీ ఎంట్రీ
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ మామూలుగా లేదు. తెలుగు - మళయాళ భాషల్లో ఇప్పటికే టాప్ రేంజ్ కి చేరుకున్న బన్నీ.. ఇప్పుడు కోలీవుడ్ పైనా కన్నేశాడు. వరుస రెండు సూపర్ హిట్స్ సాధించిన ఊపును కంటిన్యూ చేస్తూ.. తమిళ ఇండస్ట్రీలోకి దూసుకెళ్లబోతున్నాడు.

ప్రస్తుతం బోయపాటితో సరైనోడు మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. తరువాతి ప్రాజెక్టును ఇప్పటికే ఓకే చేసేశాడు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు బన్నీ. ఆ నెక్ట్స్ కూడా సెట్ చేసేస్తుండడం విశేషం. ఇదే అసలు ట్విస్ట్. కోలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన లింగుస్వామి.. బన్నీ కోసం ఓ సూపర్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఇది తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రం కావడం విశేషం.

ఇప్పటివరకూ తమిళ్ హీరోలు వచ్చి మన మార్కెట్ కొల్లగొట్టడమే తప్ప.. మనోళ్లు అక్కడ పూర్తి స్థాయిలో క్లిక్ అయిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడ మాత్రం బోర్డర్లు దాటి దూసుకుపోతున్నారు. లింగుస్వామి ప్రాజెక్టుతో పాటు.. విక్రం కుమార్ తో చేసే సినిమా కూడా బన్నీకి కోలీవుడ్ లో కలిసొచ్చే అంశమే. ప్రస్తుతం సూర్యతో విక్రం 24 సినిమా చేస్తుండడంతో.. ఇది కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సరైన ప్రాజెక్టు పడితే.. కోలీవుడ్ లో కూడా బన్నీ జెండా పాతేస్తాడనే అంచనాలున్నాయి.