Begin typing your search above and press return to search.

ఫ్యామిలీతో పాటు ఎగిరిపోతున్న బన్నీ

By:  Tupaki Desk   |   27 Aug 2017 4:36 AM GMT
ఫ్యామిలీతో పాటు ఎగిరిపోతున్న బన్నీ
X
అల్లు అర్జున్ సినిమాల స్పీడ్ ఇప్పుడు తగ్గిన మాట వాస్తవమే. మొదట్లో తెగ స్పీడ్ గా సినిమాలు చేసిన స్టైలిష్ స్టార్.. కొన్నేళ్లుగా ఏడాదికో మూవీ మాత్రమే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. సరిగ్గా పరిశీలిస్తే ఈ మార్పు అంతా అల్లు అర్జున్ పెళ్లి తర్వాత.. ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పటి నుంచి అనే విషయం అర్ధమవుతుంది.

పెళ్లయిన తర్వాత ఫ్యామిలీకి టైం కేటాయించడంలో అల్లు అర్జున్ ఏమాత్రం తటపటాయించడం లేదు. అలాగని తన కుటుంబ విశేషాలను తనే దాచుకోవడం లేదు కూడా. ఎప్పటికప్పుడు అభిమానులకు చూడచక్కని ఫొటోలను అందిస్తూ అలరిస్తున్నాడు కూడా. ఇప్పుడు బన్నీ తన ఫ్యామిలీతో పాటు రకరకాల వయసుల్లో ఉన్న ఫోటో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. మొత్తం మూడు ఫొటోలను కలిపి ఈ పోస్టర్ ను తయారు చేశారు. ఇందులో మొదటి ఫోటోలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రమే ఒక స్కూటర్ పై ఉంటే.. వెనకాల బన్నీ గాల్లో ఎగురుతూ ఇచ్చిన పోజ్ ఉంటుంది. రెండో ఫోటోకు వచ్చేసరికి.. స్నేహ చేతుల్లోకి కొడుకు అయాన్ వచ్చి చేరతాడు. కానీ అల్లు అర్జున్ పోజ్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది. లుక్ కాస్త మారుతుందిలే.

మూడో ఫోటోలో అల్లు అర్జున్.. స్నేహ.. అయాన్ లతో పాటు అల్లు అర్హా కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా బన్నీ గాల్లోకి ఎగురుతూనే ఉంటాడు. బన్నీ.. ఆ స్కూటర్ మాత్రం సేమ్ టు సేమ్ కనిపిస్తాయి. ఇదే సమయంలో వెనుక ఉన్న చెట్టు ఎంత గుబురుగా ఎదిగిందో కూడా గమనించచ్చు. తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ ను బన్నీ ఎంత అందంగా ప్రెజెంట్ చేస్తాడో కదా!!