Begin typing your search above and press return to search.

యంగ్ హీరోల‌కు బ‌న్ని లంచ్‌

By:  Tupaki Desk   |   11 Oct 2015 11:00 AM IST
యంగ్ హీరోల‌కు బ‌న్ని లంచ్‌
X
స్టార్ హీరోల్లో బ‌న్ని స్ట‌యిలే వేరు. మిగ‌తా హీరోల‌తో పోలిస్తే బ‌న్ని కొన్ని ప్ర‌త్యేక‌మైన ఆద‌ర్శ భావాలున్న యువ‌కుడు. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో మంచి సినిమాలు రావాల‌ని కోరుకునే వారిలో మొద‌టి స్థానంలో ఉంటాడు. న‌వ్యపంథా క‌థాంశాల్ని ఎంక‌రేజ్ చేయాలి. కొత్త‌గా ఎవ‌రు ఏ ప్ర‌య‌త్నం చేసినా అది విజ‌య‌వంతం కావాలి అని కోరుకుంటాడు. అంతేకాదు ప‌రిశ్ర‌మ‌లోకి న‌వ‌త‌రం హీరోలు దూసుకురావాలి. కొత్త జోన‌ర్ సినిమాల్లో న‌టించాలి. అని కూడా చెబుతుంటాడు. స్టార్ హీరోల‌కు కొన్ని స‌రిహ‌ద్దులు ఉన్నాయి. అభిమానులు, ఇమేజ్ అన్న‌ది పెద్ద స‌మ‌స్య‌.. కానీ కొత్త‌ర‌క్తం వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ప్ర‌యోగాల‌కైనా అవ‌కాశం ఉంటుంది అని నిజాయితీగా చెబుతుంటాడు. స్టార్‌ డ‌మ్‌ కి అతీతంగా అత‌డు వేదం - రుద్ర‌మ‌దేవి చిత్రాల్లో న‌టించాడు. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంలో బ‌న్ని ఓ మంచి మాట అన్న‌డు.

యంగ్ హీరో నిఖిల్ ఔటాఫ్ ది బాక్స్ ప్ర‌య‌త్నించి విజ‌యాలు అందుకుంటున్నాడు. నాని - నాగ‌చైత‌న్య లాంటి హీరోలు కొత్త‌ద‌నం ఉన్న సినిమాల్లో న‌టిస్తున్నార‌ని మెచ్చుకున్నాడు. ఇటీవ‌లి కాలంలో రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన సినిమా చూపిస్త మావ‌ - భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ - సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ వంటి చిత్రాలు .. ఘ‌న‌విజ‌యం సాధించ‌డం వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కి కొత్త క‌ళ వ‌చ్చింద‌ని అన్నాడు. అందుకే బన్ని కొంద‌రు యంగ్ హీరోల్ని స్వ‌యంగా ఆహ్వానించి ఓ లంచ్ పార్టీ కూడా ఎరేంజ్ చేశాడు. రానా ఇంట్లో ఈ లంచ్ పార్టీని ఏర్పాటు చేశాడు. నాని - నిఖిల్‌ - నాగ‌చైత‌న్య ఈ పార్టీకి విచ్చేస్తున్నారు. వీలుంటే చ‌ర‌ణ్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యే ఛాన్సుంది. టాలీవుడ్‌ లో ఇదో గొప్ప స‌త్సాంప్ర‌దాయం. హీరోల మ‌ధ్య ఇలాంటి సాన్నిహిత్యం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. బ‌న్ని - రానా - చ‌ర‌ణ్ వంటి స్టార్లు ఇలాంటి మంచి మ‌న‌స్త‌త్వంతో అంద‌రి మ‌న‌సు దోచుకోవ‌డం ప్ర‌శంసించ‌ద‌గ్గ‌దే.