Begin typing your search above and press return to search.

అల్లు డే: సెర్బియాలో ఫ్రెండ్స్ కోసం బ‌న్ని అదిరిపోయే పార్టీ

By:  Tupaki Desk   |   9 April 2023 2:04 PM GMT
అల్లు డే: సెర్బియాలో ఫ్రెండ్స్ కోసం బ‌న్ని అదిరిపోయే పార్టీ
X
త‌న‌దైన ఎన‌ర్జీ యూనిక్ స్టైల్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ఇటీవ‌ల పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందుకున్నాడు. అదే స‌మ‌యంలో ఐకాన్ స్టార్ గా బిరుదాంకితుడ‌య్యాడు. త‌దుప‌రి పుష్ప 2తో పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా స‌త్తా చాట‌నున్నాడు. అత‌డికి ఇప్పుడు ద‌క్షిణాది ఉత్త‌రాది రెండుచోట్లా భారీ ఫాలోయింగ్ తో పాటు అసాధార‌ణ మార్కెట్ ఏర్ప‌డింది. అదే క్ర‌మంలో పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నేటితో 41 ఏళ్లు పూర్త‌యింది. ఈ స్పెష‌ల్ డేని పూర్తిగా అత‌డు త‌న‌ భార్య కుటుంబంతో గడపాలని ప్లాన్ చేసాడు. స్నేహ రెడ్డి- పిల్లలు అయాన్ - అర్హ ఇత‌ర‌ కుటుంబం స్నేహితుల న‌డుమ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకున్నాడు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా రెండు రోజులుగా బ‌న్నీకి వెల్లువెత్తుతున్న ప్రశంసలు శుభాకాంక్షలు అన్నీ ఇన్నీ కావు. 2023 మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప: ది రూల్ నుంచి బ‌న్ని ఫస్ట్ లు పోస్టర్ విడుద‌లైంది.  దీనికి అద్భుతమైన స్పందన ల‌భిస్తోంది. పుట్టినరోజుకి ఒకరోజు ముందు వేర్ ఈజ్ పుష్పా? అంటూ కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదలైంది. మూడు నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న కాన్సెప్ట్ టీజర్  పాజిటివ్ వైబ్రేష‌న్స్ తో  అంత‌ర్జాలాన్ని షేక్ చేసింది.

సుకుమార్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అంచనాలను టీజ‌ర్ అమాంతం పెంచింది. ఇంత‌లోనే అర్జున్ పుష్ప 2 చిత్రీకరణ నుంచి పుట్టినరోజు వేడుక‌ల కోసం కొద్దిరోజుల‌ విరామం తీసుకున్నాడు. హైదరాబాద్ కు వచ్చిన అత‌డు తన జూబ్లీ హిల్స్ నివాసం వెలుపల గుమిగూడిన వందలాది మంది అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేసారు. శుభాకాంక్షలను పుష్పగుచ్ఛాలను స్వీకరించి ఫ్యాన్స్ తో కరచాలనం చేశాడు. టాలీవుడ్ కి చెందిన పలువురు దర్శకులు నిర్మాతలు బ‌న్నీని అతని కార్యాలయంలో ఇంటిలో కలిసి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు.

అనంత‌రం బ‌న్ని మధ్యాహ్నం స‌మ‌యంలో తన కుటుంబంతో ఇంట్లో గడిపారు. సాయంత్రం వరకు అల్లు అర్జున్ సన్నిహితులు స్నేహ ఏర్పాటు చేసిన పార్టీకి అటెండ‌య్యారు. బన్నీ తో పార్టీకి ప‌దుల‌ సంఖ్యలో  సెల‌బ్ యూత్ హాజరయ్యారు. అక్క‌డ‌ చాక్లెట్ లు -ఫ్రూట్ కేకులు- పువ్వులు- మోమోలు  41వ పుట్టినరోజు వైబ్స్ ని క్రియేట్ చేయ‌గా.. కాక్ టైల్ తో రేయంతా చిల్లింగ్ గా గ‌డిచింది. అల్లు అర్జున్  భార్య స్నేహా రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వేడుకల‌ నుండి చాలా ఫోటోల‌ను షేర్ చేసారు. ఏడాది క్రితం అల్లు అర్జున్ తన 40వ పుట్టినరోజును కజిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ స‌మ‌క్షంలో జరుపుకోగా ఈసారి త‌న భార్య పిల్ల‌ల స‌మ‌క్షంలో బంధుమిత్రుల న‌డుమ‌ మొత్తం 40 మంది వ్యక్తులతో వేడుక‌గా జ‌రుపుకున్నాడు.

అయితే ఈసారి బ‌ర్త్ డే వేడుక‌లు విదేశాల్లో జ‌రిగాయి. యూరోపియ‌న్ దేశం సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో ఒక ప్రైవేట్ వేడుక‌గా దీనిని ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.  పుష్ప భారీ విజయాన్ని - దశాబ్దాల తన ఉనికిని గుర్తు చేస్తూ బ‌న్ని తన స్నేహితుల కోసం ది బెస్ట్ పార్టీని ఇవ్వాలని ఇలా ప్లాన్ చేసాడు.  అల్లు అర్జున్ ఈ పార్టీల‌ను ముగించి  హైద‌రాబాద్ తిరిగి విచ్చేసారు. వెంటనే పుష్ప 2 చిత్రీకరణ కోసం విశాఖపట్నం బ‌య‌ల్దేరారు. ఏప్రిల్ 9 నుంచి విశాఖ‌ప‌ట్నంలో షూటింగ్ కోసం అత‌డు నేరుగా చార్టర్డ్ విమానంలో బ‌య‌ల్దేరాడ‌ని తెలిసింది.