Begin typing your search above and press return to search.

మరోసారి షాకిచ్చిన బ‌న్నీ..పెళ్లిలో బ‌న్నీ హంగామా!

By:  Tupaki Desk   |   24 March 2022 2:30 PM GMT
మరోసారి షాకిచ్చిన బ‌న్నీ..పెళ్లిలో బ‌న్నీ హంగామా!
X
టాలీవుడ్ హీరోల్లో అభిమానుల పెళ్లిళ్ల‌కి..కావాల్సిన వాళ్ల మ్యారేజ్ ల‌కి హాజ‌ర‌య్యే సంస్కృతి పెద్ద‌గా క‌నిపించ‌దు. బిజీ షెడ్యూల్ కావొచ్చు..ఇత‌ర కార‌ణాలు కావొచ్చు చాలా రేర్ గా మాత్ర‌మే అలా జ‌రుగుతుంటుంది. క్లోజ్ రిలేష‌న్స్ లో కూడా కొన్ని క్యాలుక్లేష‌న్స్ ఉంటాయి. వాటి ప్ర‌కార‌మే న‌డుచుకుంటారు. కేవ‌లం ఫ్యామిలీ ఫంక్ష‌న్లు..వ్య‌క్తిగ‌తంగా బాగా కావాల్సిన వాళ్లు అయితేనే స్టార్ హీరోలు త‌ప్ప‌క హాజ‌ర‌వుతుంటారు. మిగ‌తా సంద‌ర్భాల్లో అలాంటివ‌న్నీ వెరీ లైట్.

అయితే ఇలాంటి వారికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం భిన్న‌మ‌నే చెప్పాలి. కొన్ని విష‌యాల్లో బ‌న్నీ సింప్లీసిటీని ఫాలో అవుతాడు. అంత పెద్ద స్టార్ అయి ఉండి `పుష్ప` షూటింగ్ స‌మ‌యంలో కారులో వ‌స్తుండ‌గా మ‌ధ్య‌లో కారు ఆపి మ‌రి రోడ్డు ప‌క్క‌న పూరిగుడిలో టిఫిన్ చేసాడు. వాళ్ల‌తో కాసేపు మాట మంతి జ‌రిపి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఒక వ్య‌క్తికి ఉద్యోగం సైతం ఇస్తాన‌ని ప్రామిస్ చేసి వ‌చ్చాడు. ఆ వీడియో నెట్టింట ఏ రేంజ్ లో వైర‌ల్ అయిందో తెలిసిందే.

ఇక త‌న‌కు కావాల్సిన వాళ్లు వివాహాల‌కు ఆహ్వానిస్తే వీలుంటే త‌ప్ప‌క హాజ‌ర‌య్యే గుణం ఆయ‌న‌ది. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ త‌న చుట్టూ ఉన్న వాళ్ల‌ని ఎంతో బాగా చ‌సుకుంటాడ‌ని టాక్ ఉంది. ఎలాంటి అస‌వ‌ర‌మైన వెంట‌నే స్పందిస్తారు. గ‌త వారం త‌న టీమ్ లో ముఖ్య స‌భ్యుడైన శ‌ర‌త్ పుట్టిన రోజు వేడుల‌కు హాజ‌ర‌య్యారు. అంత‌కు ముందు త‌న పీఆర్వో వివాహానికి సైతం వెళ్లారు.

తాజాగా ఇటీవ‌లే బ‌న్ని మేన‌జ‌ర్ మ‌నోజ్ వివాహం చేసుకున్నాడు . అత‌నికి పెళ్లికి సైతం బ‌న్నీ హాజ‌ర‌య్యారు. దానికి సంబంధించిన ఫోటో ఒక‌టి నెట్ లో వైర‌ల్ అవుతుంది. బ‌న్నీ స్వ‌యంగా హాజ‌రై న‌వ‌దంపతుల్నీ ఆశీర్వ‌దించి రావ‌డం విశేషం. కొంత మంది హీరోలు ఇలాంటి వేడుక‌ల‌కు హాజ‌రైతే ఎక్క‌డ త‌మ ఇమేజ్ కి డ్యామేజ్ వ‌చ్చేస్తుంద‌ని తెగ ఫీలైపోతుంటారు. కానీ బ‌న్నీ వెరీ పాజిటివ్ ప‌ర్స‌న్ అని మ‌రోసారి రుజువైంది. బ‌న్నీ జోవియ‌ల్ ప‌ర్స‌న్. ఎవ‌రితోనైనా ఇట్టే క‌లిసిపోతాడ‌ని అత‌నితో ప‌నిచేసిన వారు చెబుతుంటారు. కీప్ గోయింగ్ బ‌న్నీ సాబ్.

ఇక బ‌న్నీ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప ది రూల్` లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే మొద‌టి భాగం `పుష్ప ది రైజ్` రిలీజ్ అయి పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా విజ‌య‌మ‌ది. దీంతో రెండ‌వ భాగంపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రాన్ని అన్ని ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌రగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.