Begin typing your search above and press return to search.

సరైనోడు పొలిటికల్ గేమ్ ఆడతాడా?

By:  Tupaki Desk   |   21 April 2016 1:00 AM IST
సరైనోడు పొలిటికల్ గేమ్ ఆడతాడా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడు మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటివరకూ ఈ సినిమా స్టోరీ ఏంటో కొంచెం కూడా లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు యూనిట్. ముఖ్యంగా బోయపాటి శ్రీను సరైనోడు కథ గురించి కాసిన్ని వివరాలు కూడా బయటకు రానివ్వలేదు. ఇలా స్టోరీని సీక్రెట్ గా మెయింటెయిన్ చేయడానికి మెయిన్ రీజన్.. ఇందులో పొలిటికల్ థ్రిల్స్ ఉండడమే అంటున్నారు.

సరైనోడులో ఒక హీరోయిన్ గా నటిస్తున్న కేథరిన్ థ్రెసా ఎమ్మెల్యే రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర ద్వారానే చాలానే పొలిటికల్ లింక్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. సహజంగానే బోయపాటి శ్రీను సినిమాల్లో పొలిటికల్ పంచ్ లు బాగానే వినిపిస్తాయి. ఇప్పుడలాంటి డైలాగ్స్ బన్నీ నోటి వెంట కూడా ఎక్కువగానే ఉంటాయట. అలాగే స్టోరీ కూడా పొలిటికల్ గేమ్ మాదిరిగా ఉండనుందని అంటున్నారు.

బన్నీ వేసే పొలిటికల్ పంచ్ లకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే అనుకుంటున్నారు యూనిట్. ఈ మూవీపై నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అందుకే నైజాం - ఈస్ట్ - వెస్ట్ - కృష్ణా జిల్లాల్లో తామే విడుదల చేసుకుంటున్నారు. ఇక సరైనోడు ప్రమోషన్స్ కోసం రిలీజ్ ముందు రోజున... బన్నీ బెంగళూరు కేంప్ వేయనున్నాడు.