Begin typing your search above and press return to search.

సరైనోడు ఎవరి సినిమా?

By:  Tupaki Desk   |   20 April 2016 6:22 PM IST
సరైనోడు ఎవరి సినిమా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే సినిమాలంటే అభిమానుల్లో ఓ అంచనా ఉంటుంది. దర్శకుడు బోయపాటి శ్రీను మూవీ అంటే జనాల్లో ఓ ఐడియా ఉంటుంది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు చిత్రం ఎలా ఉంటుందనే ప్రశ్నకు ఇప్పటివరకూ సరైన ఆన్సర్ దొరకలేదు.

ఇప్పుడు సరైనోడు పబ్లిసిటీ యాంగిల్ చూస్తుంటే మాత్రం.. ఓ అంచనాకు రావచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలు అల్లు అర్జున్ అండ్ కో స్వయంగా చూసుకుంటున్నారు. సొంత బ్యానర్ లో రూపొందిన మూవీ కాబట్టి.. ఆ మాత్రం అటెన్షన్ ఉండడం తప్పు లేదు. కానీ తను తీసే ప్రతీ సినిమాకి సంబంధించిన మీడియా ప్రమోషన్స్ స్వయంగా హ్యాండిల్ చేస్తాడు బోయపాటి. సరిగ్గా విడుదలకు ముందు రోజు పెద్దమ్మ గుడిలో భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాడు. ఇప్పుడు సరైనోడు విషయంలో బోయపాటి నుంచి ఇలాంటి ఎటెంప్ట్స్ ఏవీ కనిపించలేదు.

సరైనోడు పూర్తిగా తన స్టైల్ మూవీయే అన్నట్లుగా బన్నీ ప్రచారం సాగుతోంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే.. ఈ టైపు ప్రచారంతో క్రెడిట్ అంతా బన్నీ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఒకవేళ రిజల్ట్ తేడా వస్తే మాత్రం.. ఆ ఎఫెక్ట్ కూడా అల్లు అర్జున్ మోయాల్సి ఉంటుంది. రెండింటికీ బన్నీ రెడీ అయిపోయాడంటున్నారు. ఏప్రిల్ 22న సరైనోడు విడుదల కాగా.. ఆ ముందు రోజు నుంచి బోయపాటిశ్రీను తన మార్క్ ప్రచారం స్టార్ట్ చేయనున్నాడు.