Begin typing your search above and press return to search.

దటీజ్ అల్లు అర్జున్...

By:  Tupaki Desk   |   20 March 2016 11:30 AM GMT
దటీజ్ అల్లు అర్జున్...
X
సౌత్ ఇండియాలో మోస్ట్ ట్రెండీయెస్ట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జునే అంటారు జనాలు. గత కొన్నేళ్లలో బన్నీ ఫాలోయింగ్ విపరీతంగా పెరగడానికి స్టైల్ విషయంలో కానీ.. ప్రమోషన్ల విషయంలో కానీ బన్నీ చాలా ట్రెండీగా ఉండటమే కారణం. సిక్స్ ప్యాక్ చేయడమైనా.. ఎప్పటికప్పుడు లుక్ మారుస్తూ ట్రెండీగా కనిపించడంలో అయినా.. బన్నీ తర్వాతే ఎవరైనా. ఇక తెలుగు సినిమాల ప్రమోషన్ ను సైతం బన్నీ కొత్త పుంతలు తొక్కించాడు.

మన స్టార్ హీరోలందరూ ప్రమోషన్ కు ఉన్న విలువేంటన్నది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు కానీ.. బన్నీ ఎప్పట్నుంచో ప్రమోషన్ విషయంలో మిగతా వాళ్లకంటే చాలా ముందుంటున్నాడు. తన గత సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ను బన్నీ ఏ స్థాయిలో ప్రమోట్ చేశాడో అందరికీ తెలిసిందే. సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిందంటే.. దానికి చేసిన ప్రమోషన్ కూడా ఓ కారణం.

తన కొత్త సినిమా ‘సరైనోడు’ మీద విపరీతమైన హైప్ రావడంలో కూడా బన్నీ అండ్ టీమ్ ప్రమోషనల్ స్ట్రాటజీ కీలక పాత్ర పోషించింది. ఇక అందరిలాగా రొటీన్ గా ఆడియో ఫంక్షన్ చేయకుండా.. ప్రి రిలీజ్ ఫంక్షన్ అంటూ ఓ సరికొత్త ఆలోచన చేసింది ‘సరైనోడు’ టీమ్. ఏప్రిల్ తొలి వారమంతా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సందడి ఉంటుంది కాబట్టి.. ఆ హడావుడిలో ఆడియో వేడుక ఎందుకని భావించి..రిలీజ్ కు ముందు వైజాగ్ లో ప్రి రిలీజ్ ఫంక్షన్ పేరుతో ఓ సరికొత్త వేడుకకు రెడీ అవుతున్నాడు బన్నీ. ఇది టాలీవుడ్ లో సరికొత్త ట్రెండుకు తెరతీస్తుందని భావిస్తున్నారు. మరి ఆ వేడుక ఉద్దేశమేంటో.. అందులో కొత్తగా ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి మిగతా హీరోలకు తాను చాలా భిన్నమని మాత్రం బన్నీ చాటుకుంటున్నాడు.