Begin typing your search above and press return to search.

బన్నీ కన్ఫ్యూజన్లో పెట్టేశాడు

By:  Tupaki Desk   |   21 April 2016 1:19 PM GMT
బన్నీ కన్ఫ్యూజన్లో పెట్టేశాడు
X
గత కొన్నేళ్ల నుంచి ఒక సినిమాకు ఇంకో సినిమాకు గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. మిగతా హీరోల్లాగా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో సినిమాను లైన్లో పెట్టట్లేదు. ఓ సినిమాను పూర్తి చేసి.. ప్రమోట్ చేసి.. అది థియేటర్లలోకి వెళ్లాక గానీ.. తర్వాతి సినిమా దిశగా అడుగు వేయట్లేదు బన్నీ. స్క్రిప్టు విషయంలో ఏమాత్రం తొందరపడకుండా.. దర్శకులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి.. నెమ్మదిగా పని పూర్తి చేయించి.. ఆ తర్వాత కానీ రంగంలోకి దిగట్లేదు. ‘జులాయి’ దగ్గర్నుంచి ఈ పద్ధతినే ఫాలో అవుతున్నాడు బన్నీ. అందుకే సినిమాకు.. సినిమాకు మధ్య కనీసం ఏడాది గ్యాప్ ఉంటోంది. ‘సరైనోడు’ తర్వాత కూడా ఇలాగే బన్నీ కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బన్నీ తర్వాతి సినిమా ఏంటన్నది ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

ఐతే ‘సరైనోడు’ ప్రమోషన్లలో భాగంగా బెంగళూరులో ప్రెస్ మీట్ కు హాజరైన బన్నీ.. అక్కడ తన తర్వాతి సినిమా గురించి ఓ హింట్ ఇచ్చాడు. తన నెక్స్ట్ మూవీ రెండు భాషల్లో తెరకెక్కుతుందని అతను ప్రకటించాడు. కానీ దర్శకుడెవరన్నది మాత్రం వెల్లడించలేదు. విక్రమ్ కుమార్.. లింగుస్వామి.. ఇద్దరూ కూడా బన్నీతో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. వీళ్లిద్దరూ రెండు భాషల మీదా పట్టున్నవాళ్లే. బన్నీతో ద్విభాషా చిత్రం చేయాలని చూస్తున్నవాళ్లే. మరి బన్నీ వీళ్లిద్దరిలో ఎవరికి ఓటేస్తాడో చూడాలి. విక్రమ్ సినిమా ‘24’ ఫలితాన్ని బట్టి కూడా అతను నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఆ సినిమా హిట్టయితే విక్రమ్ కు ఓటేయొచ్చు. లేదంటే లింగుస్వామి వైపు చూడొచ్చేమో.