Begin typing your search above and press return to search.

డీజే నవ్వులు ఆగతున్నట్లే లేవే

By:  Tupaki Desk   |   29 March 2017 5:07 PM GMT
డీజే నవ్వులు ఆగతున్నట్లే లేవే
X
ఈ సమ్మర్ కి రిలీజ్ కానున్న చిత్రాల్లో.. అత్యంత ఆసక్తి కలిసిస్తున్న మూవీస్ లో అల్లు అర్జున్ నటిస్తున్న డీజే-దువ్వాడ జగన్నాధం కూడా ఒకటి. కంప్లీట్ ఫన్ జోనర్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఆడియన్స్ నుంచి ఇండస్ట్రీ జనాల వరకూ బోలెడంతగా ఎదురుచూపులు ఉన్నాయి.

గత నెలలో డీజే టీజర్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ ఆ స్థాయిలో ఏదీ అప్ డేట్ ఇవ్వలేదు డీజే యూనిట్. కానీ ఉగాది పండుగ సందర్భంగా.. ఇప్పుడు కొన్ని షూటింగ్ స్పాట్ ఫోటోలను రిలీజ్ చేశారు. హీరో అల్లు అర్జున్.. ప్రొడ్యూసర్ దిల్ రాజు.. డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రముఖంగా కనిపిస్తున్న ఈ ఫోటోల్లో కామన్ పాయింట్.. అత్యధికంగా ఆకట్టుకునే విషయం ఏంటంటే.. అన్ని ఫోటోలలో బన్నీ నవ్వులు మాత్రమే. ఓ స్టార్ హీరో ఈ రేంజ్ లో షూటింగ్ స్పాట్ లో ఎంజాయ్ చేస్తున్నాడంటే.. ఆ పరిసరాలన్నీ ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ మూవీలో బ్రాహ్మిన్ పాత్రలో బన్నీ విపరీతంగా నవ్వించబోతున్నాడనే విషయంలో క్లారిటీ ఉంది కానీ.. స్వయంగా హీరోనే ఈ రేంజ్ లో నవ్వుతున్నాడంటే.. ఇక ఆ హీరో పంచే నవ్వులు ఏ రేంజ్ లో ఉంటాయో! మొత్తం మీద డీజే నవ్వులు అన్ లిమిటెడ్ అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/