Begin typing your search above and press return to search.

బ‌న్నీ సంక్రాంతి పండుగ ఇక్క‌డా...అక్క‌డా?

By:  Tupaki Desk   |   1 Jan 2023 6:45 AM GMT
బ‌న్నీ సంక్రాంతి పండుగ ఇక్క‌డా...అక్క‌డా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కుటుంబ‌మంటే? ఎంతో ఇష్టం. సెల‌వులు దొరికితే భార్య‌..పిల్ల‌ల‌తోనే కాల‌క్షేపం చేస్తారు. అదీ హైద‌రాబాద్ లోనే. విదేశాలు వెళ్ల‌డం చాలా రేర్. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రి అయ్యాక‌! వెకేష‌న్లు పూర్తిగా దూర‌మైన‌ట్లు క‌నిపిస్తుంది. ముఖ్యంగా అర్హ పుట్టిన త‌ర్వాత ఇంటినే ఓ వెకేష‌న్ స్పాట్ లా మార్చేసారు. అర్హ ఎక్క‌డుంటే? అదే సంతోషం..అదే నా వెకేష‌న్ స్పాట్ అవుతుంద‌న్న‌ రీతులో కుమార్తెతో ఆస్వాదిస్తారు.

న్యూ ఇయ‌ర్ వేడుక‌లు సైతం ఇంట్లోనే సెల‌బ్రేట్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈసారి సంక్రాంతి పండుగ ఎక్క‌బ సెల‌బ్రేట్ చేసుకుంటారు? అనే ఓ డౌట్ రెయిజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడ‌ప్పుడు బ‌న్నీ...స‌తీమ‌ణి స్నేహారెడ్డి అమ్మ‌మ్మ వాళ్లింట్లోనూ సెల‌బ్రేట్ చేసుకున్న సంద‌ర్భాలున్నాయి. పిల్లలు పుట్ట‌క‌ముందే బ‌న్నీ అత్త వారింటికి ఎక్కువ‌గానే తిరిగేవారు.

పండ‌గ‌లు..ప‌బ్బాలు వ‌చ్చాయంటే వాలిపోయేవారు. ఓ సంవ‌త్స‌రం ఏకంగా ప‌నిలో ప‌నిగా స్నేహారెడ్డి అమ్మ‌మ్మ ఇంట్లోనూ సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఆ ఏడాది అక్క‌డ అమ్మాయిల‌కు బన్నీ సెల్పీలు ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. అయితే కొంత కాలంగా ఆర‌క‌మైన సెల‌బ్రేష‌న్స్ కి దూరంగా ఉంటున్నారు. వేడుక ఏదైనా హైద‌చాబాద్ లోనే అల్లువారి కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి క‌టుంబ‌మంతా బెంగుళూరులోనూ ఫామ్ హౌస్ లో సెల‌బ్రేట్ చేసుకుంటారు. కొన్నిసార్లు బ‌న్నీ కూడా వెళ్లారు. అయితే కొన్నాళ్ల‌గా అక్క‌డికి వెళ్ల‌డం లేదు. మరి 2023 సంక్రాంతి పండుగ‌ను ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇక బన్నీ నిరాడంబ‌ర‌త గ‌రించి చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా సింపుల్ గా ఉంటాడు. నిగ‌ర్వి. క‌లుపుగోలు వ్యక్తిత్వం ఉన్నావారు. టిఫిన్ చేయాలంటే? స్టార్ హోట‌ల్ అవ‌స‌రం లేదు. స్పాట్ లో కాకా హోట‌ల్ ఉన్నా అడ్జ‌స్ట్ అవుతారు. స‌హాయం చేయ‌డంలోనూ ముందుంటారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ చోర‌వ చూపిస్తారు. ప్ర‌స్తుతం బ‌న్నీ హీరోగా `పుష్ప‌-2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.