Begin typing your search above and press return to search.

ఊటీలో భేటీ అవ్వబోతున్న బన్నీ

By:  Tupaki Desk   |   24 Sept 2017 7:00 AM IST
ఊటీలో భేటీ అవ్వబోతున్న బన్నీ
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. అందరి హీరోల్లా కాకుండా అప్పుడపుడు కొన్ని వినూత్న కథలని ఎంచుకొని ప్రయోగాలు చేస్తూ.. ఉంటాడు. ఇక టాలీవుడ్ లో డ్యాన్సులు ఇరగదీసే వారిలో బన్నీ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. అయితే చాలా రోజుల తర్వాత బన్నీ మరో కొత్త తరహా కథతో రాబోతున్నాడు.

చాలా సినిమాలకు కథలను అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య అనే సినిమాలో బన్నీ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక దేశ సైనికుడిగా కొత్తగా కనిపించడానికి బన్నీ చాలా శ్రమిస్తున్నాడు. ఈ సారి అన్ని సినిమాల్లో కనిపించినట్లుగా కాకుండా కొంచెం బాడీని ఎవ్వరు చూపించని విధంగా చూపించడానికి కసరత్తులు చేస్తున్నాడట. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా రీసెంట్ గా హైదరాబాద్ లో షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

ఇప్పుడు మళ్లీ మరో షెడ్యూల్ నిమిత్తం ఊటీ వెళ్ళడానికి సిద్ధమైంది. సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని అక్కడ చిత్రీకరించడానికి సిద్దమయ్యాడట దర్శకుడు. ఈ ఊటీ భేటీలో సినిమాకు సంబంధించిన చాలా ముఖ్యమైన సీన్లను తీస్తారని అంటున్నారు. ముఖ్యంగా ఆర్మీ క్యాంపులు వంటి సెట్లను అక్కడే రూపొందించే ఛాన్సుందట. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పై శ్రీధర్ లగడపాటి- బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక బన్నీ కి జోడిగా అను ఎమ్మాన్యుయేల్ నటిస్తుండగా విశాల్ -శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.