Begin typing your search above and press return to search.

నా పేరు సూర్య.. జనవరి 1న ఇంపాక్ట్

By:  Tupaki Desk   |   24 Dec 2017 4:18 AM GMT
నా పేరు సూర్య.. జనవరి 1న ఇంపాక్ట్
X
శనివారం ఉదయాన్నే స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నుండి ఒక ప్రకటన వచ్చింది. ఈరోజు రాత్రి 10.30 కు ''నా పేరు సూర్య'' గురించి ఒక విషయం చెప్పబోతున్నాం అంటూ ఆ మెసేజ్ సారాంశం. అందుకే చాలామంది మెగా అభిమానులు.. ఎక్ల్సూజివ్ అల్లు వారి ఫ్యాన్సు.. అందరూ కూడా రాత్రి పదిన్నర ఎప్పుడవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసా?

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ముందు ప్రీ-లుక్.. ప్రీ-లుక్ రిలీజ్ చేయడానికి ముందు టైటిల్ లుక్.. ఇలా నడుస్తోంది ప్రమోషన్ కహానీ అంతా. అలాగే ఇప్పుడు 'నా పేరు సూర్య' గురించి స్వయంగా బన్నీ ఏం చెప్పాడంటే.. జనవరి 1న సినిమా తాలూకు ఫస్ట్ ఇంపాక్ట్ ఉండోబోతందట. అంటే సినిమాలో మనోడు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడుగా.. అందుకే ఇలా ఇంపాక్ట్ అంటూ ట్రెడిషనల్ మిలిటరీ పదాలు వాడారులే. సో.. మరో వారం రోజుల్లో బన్నీ కూడా న్యూ ఇయర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనమాట. గతంలో ఈ సినిమా లోగో లుక్ ను కూడా ఇదే తరహాలో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ అంటే.. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమేకాదు.. 1 నిమిషం 20 సెక్లను ఉన్న టీజర్ కూడా రిలీజ్ చేస్తారట.

మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో.. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో.. రైటర్ వక్కంతం వంశీ తొలిసారిగా డైరక్షన్ చేస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ కంపోజర్స్ విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. డస్కీ బ్యూటి అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అది సంగతి.