Begin typing your search above and press return to search.

క్లాస్ డైరెక్టర్ తో అల్లు అర్జున్?

By:  Tupaki Desk   |   3 Sep 2015 9:38 AM GMT
క్లాస్ డైరెక్టర్ తో అల్లు అర్జున్?
X
తెలుగులో పుష్కరం కిందట వచ్చిన సినిమా 'ఇష్టం'. ఇద్దరు దర్శకులు ఉమ్మడిగా తీసిన సినిమా ఇది. వారికదే తొలి సినిమా. ఆ ఇద్దరిలో ఒకడు విక్రమ్ కుమార్. తొలి సినిమా అంతగా ఆడకున్నా.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత '13 బి' లాంటి విలక్షణమైన సినిమాతో తనేంటో రుజువు చేసుకున్నాడు విక్రమ్. ఆ తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని 'ఇష్క్' సినిమాతో నితిన్ ను హీరోగా నిలబెట్టాడు. ఆపై 'మనం' కథ తెలిసిందే. తెలుగువారి మనసుల్ని తట్టిన సినిమా అది. 'మనం’'తర్వాత విక్రమ్ తో సినిమా చేయడానికి చాలా మంది లైన్లో ఉన్నా.. అతను మాత్రం తాను చాన్నాళ్లుగా సూర్యతో తీయాలని కలలు కంటున్న సైంటిఫిక్ థ్రిల్లర్ '24' సినిమా మొదలుపెట్టాడు. ఇది పూర్తయ్యే దశలో ఉంది.

ఐతే దీని తర్వాత విక్రమ్ సినిమా ఏంటని అందరిలోనూ ఆసక్తి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆయన మళ్లీ టాలీవుడ్ కు రాబోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈ మధ్యే బన్నీకి ఓ కథ చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాడట. వచ్చే ఏడాది ఆరంభంలో ఆ సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. కొరటాల శివతో సినిమా అన్నారు కానీ.. అదేమీ ఖాయం కాదు. విక్రమ్ లాంటి దర్శకుడితో పని చేయడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. బన్నీ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకపోతే బోయపాటి లాంటి వీర మాస్ డైరెక్టర్ తో చేస్తున్న బన్నీ.. వెంటనే విక్రమ్ లాంటి క్లాస్ డైరెక్టర్ తో చేస్తే ఎలా ఉంటుందన్నదే డౌటు.