Begin typing your search above and press return to search.

యానిమేట‌ర్ కాబోయి స్టార్ హీరో అయ్యాడు!

By:  Tupaki Desk   |   29 Dec 2019 6:23 AM GMT
యానిమేట‌ర్ కాబోయి స్టార్ హీరో అయ్యాడు!
X
గంగోత్రి సినిమాతో హీరో అయ్యాడు బ‌న్ని. మొద‌టి సినిమానే హిట్టు. కానీ అత‌డు హీరో ఏమిటి? అని విమ‌ర్శించిన వాళ్లు ఎంద‌రో. అయితే అన్ని విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టి బ‌న్ని స్టైలిష్ స్టార్ గా ఎదిగిన తీరు అస‌మానం. ఆర్య- దేశ‌ముదురు చిత్రాల‌తోనే అత‌డి రేంజు మారిపోయింది. ఆ త‌ర్వాత సీన్ తెలిసిందే క‌దా! టాలీవుడ్ ప్రామిస్సింగ్ స్టార్ హీరోల్లో ఒక‌రిగా బ‌న్ని స్థానం టాప్ 5లో ఉంది. అయితే అత‌డు తొలి సినిమాకి అంగీక‌రించే ముందు అస‌లేం జ‌రిగిందో త‌న మాతృమూర్తి నిర్మ‌ల‌మ్మ చెప్పిన సంగ‌తులు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

నిర్మ‌లమ్మ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. మా పెళ్ల‌యిన నాలుగైదేళ్లకు చిరంజీవిగారితో సురేఖ పెళ్లి అయ్యింది. ఆ తర్వాత మెగాస్టార్ ఈవెంట్లు చూసిన‌ప్పుడు బ‌న్ని హీరో అయితే.. ఇలాంటి ఫంక్షన్స్ పేరుతో వేదిక‌ల‌పై చూడొచ్చు అనుకున్నాను. సేమ్ టైమ్ స్ట‌డీ పూర్తి చేసి ప‌రిణ‌తి చెందాకే బ‌న్ని ఇండస్ట్రీలోకి వెళితే బాగుంటుందని అనుకున్నా. ఇదంతా బ‌ల‌వంతం లేకుండా త‌న ఇష్టంతోనే జ‌ర‌గాల‌ని అనుకున్నాను`` అని తెలిపారు.

ఇక హీరో కాక‌పోతే ఏమ‌య్యేవాడు? అన్న ప్ర‌శ్న‌కు .. బ‌న్ని మంచి యానిమేట‌ర్ అని కూడా తెలిపారు. బ‌న్ని యానిమేషన్‌ స్కూల్ లో అడ్మిషన్ కోసం రోజూ 10-12 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. అలా సీటు సంపాదించాడు. కానీ విధి వేరొక‌లా ఉంది. సీట్‌ వచ్చాక`గంగోత్రి` చాన్సొచ్చింది. `ఒక సెమిస్టర్‌ మానేయ్‌.. `గంగోత్రి` క్లిక్‌ అయితే చూద్దాం అన్నాను. తొలి ప్ర‌య‌త్నం స‌క్సెసైంది. త‌ర్వాత ఆర్య చేసి నిరూపించుకున్నాడు. అటుపై హీరోగా కొన‌సాగాడు.. అని నిర్మ‌ల గారు తెలిపారు.