Begin typing your search above and press return to search.

వరుసగా ఆరేళ్లు బన్నీనే నెం.1

By:  Tupaki Desk   |   6 Dec 2020 4:32 PM IST
వరుసగా ఆరేళ్లు బన్నీనే నెం.1
X
అల్లు అర్జున్‌ కేవలం టాలీవుడ్‌ లోనే కాకుండా మలయాళంలో కూడా మంచి గుర్తింపు ఉన్న హీరో. అక్కడ ఈయనకు ఉన్న ఇమేజ్‌ అంతా ఇంతా కాదు. మలయాళ స్టార్‌ హీరోలతో పోటీగా ఈయన అక్కడ స్టార్‌ డంను దక్కించుకున్నాడు. ఈమద్య కాలంలో తన సినిమాలను డబ్బింగ్‌ చేసి హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం ద్వారా ఉత్తరాదిన కూడా భారీ క్రేజ్‌ ను దక్కించుకున్నాడు. అందుకే బన్నీకి అరుదైన రికార్డు దక్కింది. వరుసగా ఆరు సంవత్సరాలుగా బన్నీ నెం.1 హీరోగా యాహూ సెర్చ్‌ లో నిలుస్తున్నాడు.

యాహూ సెర్చ్‌ ఇంజిన్‌ లో అల్లు అర్జున్‌ మోస్ట్‌ సెర్చింగ్‌ సెలబ్రెటీల జాబితాలో టాప్‌ లో ఉన్నాడు. ఇండియాలో యాహూ మోస్ట్‌ సెర్చింగ్‌ సెలబ్రెటీల జాబితాలో అల్లు అర్జున్‌ నిలిచాడు. టాలీవుడ్‌ నుండి ఒకే ఒక్క హీరోగా బన్నీ నిలిచాడు. ఇప్పుడే కాకుండా 2014 నుండి కూడా యాహూ సెర్చ్‌ ఇంజిన్‌ లో టాలీవుడ్‌ లో నెం.1 గా నిలుస్తు వస్తున్నాడు.

యాహూ యూజర్లు ఎక్కువగా బన్నీనే సెర్చ్‌ చేస్తుండటం అందరికి ఆశ్చర్యంగా ఉంది. వరుసగా ఆరు సంవత్సరాలుగా టాలీవుడ్‌ నెం.1 గా నిలవడం మామూలు విషయం కాదు. బన్నీ ఈ రికార్డును మరెంత కాలం కొనసాగిస్తాడో చూడాలి. పుష్పతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న బన్నీకి మరింత పాపులారిటీ పెరగడం వల్ల వచ్చే ఏడాది కూడా నెం.1 గానే నిలిచే అవకాశం లేకపోలేదు అంటూ బన్నీ అభిమానులు అంటున్నారు.